'లైంగిక పటుత్వం'పై భార్య పిటిషన్.. చేయించుకోవాల్సిందేనన్న కోర్టు..

లైంగిక పటుత్వ పరీక్ష చేయించుకోవడం వ్యక్తిగత స్వేచ్చను హరించడం కాదని తెలిపారు. ఈ మేరకు భర్త దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ కొట్టివేసి పరీక్ష చేయించుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు.

హైదరాబాద్: అదనపు కట్నం కోసం వేధిస్తున్న ఓ భర్తపై భార్య న్యాయపోరాటం చేస్తోంది. లైంగిక పటుత్వం లేకపోయినా.. ఆ విషయాన్ని దాచిపెట్టి తనను పెళ్లి చేసుకన్నాడని, ఆపై అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని తొలుత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ నేపథ్యంలో విచారణలో భాగంగా పోలీసులు ఆమె భర్తకు లైంగిక పటుత్వ పరీక్షలు నిర్వహించాలనుకున్నారు. అయితే అందుకు అతను నిరాకరించడంతో కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ను విచారించిన మెజిస్ట్రేట్ దాన్ని కొట్టివేసింది.

Rare verdict of high court husband must seek sexual strength

మెజిస్ట్రేట్ తీరును సవాల్ చేస్తూ పోలీసులు తిరిగి అప్పీల్ దాఖలు చేయడంతో సెషన్స్ కోర్టు కింది కోర్టు ఉత్తర్వులను రద్దు చేసి లైంగిక పటుత్వ పరీక్ష చేయించుకోవాల్సిందేనని ఆమె భర్తకు స్పష్టం చేసింది.

కింది కోర్టు ఇచ్చిన తీర్పును ఆమె భర్త హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు భార్య అభ్యర్థనను సమర్థించారు. లైంగిక పటుత్వ పరీక్ష చేయించుకోవడం వ్యక్తిగత స్వేచ్చను హరించడం కాదని తెలిపారు. ఈ మేరకు భర్త దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ కొట్టివేసి పరీక్ష చేయించుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+