వంటనూనె ప్యాకెట్‌లో ఎలుక: యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానం(వీడియో)
హైదరాబాద్: నగరంలో మంచిపేరున్న సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేసిన ఓ వంటనూనె ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక కనిపించింది. దీంతో ఆందోళన చెందిన వినియోగదారులు ఆ సూపర్‌మార్కెట్ యజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. వారికి నిర్లక్ష్యపు సమాధానమే ఎదురైంది. ఈ ఘటన నగరంలోని రామంతాపూర్‌లో చోటుచేసుకుంది.
బాధితుడు, దూరదర్శన్‌లో పనిచేసే చక్రపాణి ఘటనకు సంబంధించిన వివరాలను తెలిపారు. గత పది రోజుల క్రితం ఆయన భార్య అరుణ రామంతాపూర్ ఉన్న డీమార్ట్ సూపర్ మార్కెట్‌లో అంబ్రెల్లా అనే బ్రాండ్‌కు చెందిన 5 వంటనూనె ప్యాకెట్లను కొనుగోలు చేశారు. అందులో ఒకదానిలో చనిపోయిన ఎలుక కనిపించింది.

ఊహించని పరిణామం ఎదురవడంతో ఆశ్చర్యపోయిన అరుణ నూనె ప్యాకెట్‌ను తీసుకొని డీమార్ట్‌కు వెళ్లారు. నూనె ప్యాకెట్‌లో ఎలుక వచ్చిన విషయాన్ని సూపర్ మార్కెట్ నిర్వాహకుల దృష్టికి తీసుకువెళ్లారు.
అయితే, తమకు ఈ నూనె ప్యాకెట్‌తో సంబంధం లేదని, దానిని తాము తయారుచేయలేదని యాజమాన్యం బదులిచ్చారు. అంతేగాక, సంబంధిత బ్రాండ్ కంపెనీని సంప్రదించండని నిర్లక్ష్యంగా చెప్పారని చక్రపాణి తెలిపారు.
-
ప్రయాణీకులకు TGSRTC గుడ్ న్యూస్, ఛార్జీల తగ్గింపు..!! -
హైదరాబాద్ బిర్యానీ లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. వెయిటింగ్ తప్పదు! వీడియో -
ఇన్నాళ్లు ఆ విషయం దాచిపెట్టా - కేటీఆర్ -
హిందూ దేవుళ్లు అంటే లెక్కలేదా.. విద్యార్ధిపై స్కూల్ ప్రిన్సిపల్ దాష్టికం -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం












Click it and Unblock the Notifications