Ration Cards: బ్యాడ్ న్యూస్.. 76,842 రేషన్ కార్డు రద్దు!

Ration Cards: తెలంగాణ సర్కారు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉ్న అర్హులకు రేషన్ కార్డులు అందిస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ కార్డుల ద్వారా చాలా పథకాలు రాష్ట్రంలో అమలు అవుతున్నాయి. కానీ గత కొంతకాలంగా వేలాది మంది ప్రజలు రేషన్ కార్డులు ఉన్నా.. వాటిని వినియోగించుకుని రేషన్ తీసుకోవడం లేదు. అలాంటి వారిపై రాష్ట్ర పౌరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వరుసగా 6 నెలల పాటు రేషన్ తీసుకోని వారి కార్డులను రద్దు చేసేందుకు పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. అన్ని మండలాల నుంచి అధికారులు ఇప్పటికే సమాచారాన్ని సేకరించారు.

గత ఆరు నెలల్లో రేషన్ తీసుకోని వారి వివరాలను అధికార యత్రాంగం పరిశీలించింది. ఇందులో ఒక్కసారి కూడా రేషన్ తీసుకోని 76,842 రేషన్ కార్డులు ఉన్నట్లు తేలింది. దీంతో ఈ మొత్తం కార్డులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ వివరాలను పౌరసరఫరాల శాఖ అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించడంతో పాటు.. కొద్ది రోజుల్లోనే వారిని రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించనున్నట్లు తెలిపింది. కలెక్టర్ల నుంచి వచ్చిన నివేదిక ఆధారంగా 76,842 రేషన్ కార్డుల్లో ఉన్నా అనర్హులను గుర్తించి త్వరలోనే వారి కార్డులను రద్దు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ తెలిపింది.

Ration Cards Cancelled 76 842 Telangana Cards Revoked for Non-Usage

కనీసం 6 నెలలుగా రేషన్ తీసుకోని వారి జాబితాను కేంద్ర సర్కారు ఇటీవలే రాష్ట్రానికి పంపింది. ఈ క్రమంలోనే పౌరసరఫరాల శాఖ ఆ జాబితాను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించి క్షేత్రస్థాయిలో విచారణ చేయించింది. ఈ విచారణలో 76,842 రేషన్ కార్డులను అనర్హమైనవిగా తేల్చారు. కొందరు లబ్ధికారులు మరణించినా వివరాలు అప్డేట్ కాలేదు. మరికొద్ది మంది ఆధారాలు వివరాలు తప్పుగా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. మరికొందరు ఈ-కేవైసీ పూర్తి చేయలేదు. త్వరలోనే అనర్హుల రేషన్ కార్డులు తొలగిపోనున్నట్లు తెలిసింది. రద్దయ్యే రేషన్ కార్డులపు అధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాల్లో ఉన్నారని కేంద్ర సర్కారు పంపిన జాబితా ఆధారంగా తెలిసింది. రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 91.83 లక్షలకు చేరింది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 2 లక్షల రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+