• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పార్టీ కాక‌పోయినా చంద్ర‌బాబు ను డిఫెండ్ చేస్తున్న రేవంత్..! శ‌భాష్ అంటున్న టీడిపి శ్రేణులు..!!

|

హైద‌రాబాద్ : తెలంగాణ లో రాజ‌కీయ ఆరోప‌ణ‌లు, ప్ర‌త్యారోప‌ణ‌లు మోతాదు మించుతున్నాయి. శ్రుతి మించిన విమ‌ర్శ‌ల‌కు ఆప‌ధ‌ర్మ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు ఆజ్యం పోయ‌గా ప్ర‌తిప‌క్షాలు వాటిని ఆయుధంలా వాడుకుంటున్నాయి. చంద్ర‌బాబు పై చంద్ర‌శేఖ‌ర్ రావు చేస్తున్న ఘాటు విమ‌ర్శ‌ల‌కు తెలుగుదేశం నేత‌లు కాకుండా కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి కౌంట‌ర్ ఇవ్వ‌డాన్ని టీడిపి శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగ‌తిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడై ఉండి చంద్ర‌బాబుకు సంఘీభావంగా మాట్లాడుతున్నందుకు రేవంత్ రెడ్డి పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు టీడిపి కార్య‌క‌ర్త‌లు.

  ఓటుకు నోటు కేసులో ఏం పీకుతాడు?
  కేసీఆర్ విమ‌ర్శ‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తున్న రేవంత్ రెడ్డి..! చ‌ప్ప‌ట్లు కొడుతున్న టీడిపి శ్రేణులు..!

  కేసీఆర్ విమ‌ర్శ‌ల‌కు గ‌ట్టి కౌంట‌ర్ ఇస్తున్న రేవంత్ రెడ్డి..! చ‌ప్ప‌ట్లు కొడుతున్న టీడిపి శ్రేణులు..!

  ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం. తెలుగుదేశం పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆయన, కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతేకాదు, ఇటీవలే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వంపై నిరంతంర పోరాటం చేస్తున్నారు రేవంత్ . అందుకే టీఆర్ఎస్ నాయకులకు ఆయనో సింహస్వప్నం. ఈ కారణంగానే రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో పాగా వేసి, ఆయనకు చెక్ పెట్టాలని అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తోంది.

  రేవంత్ తెగింపుకు ఆశ్చ‌ర్య‌పోతున్న అదికార గ‌ణం..! కొడంగ‌ల్ లో మొహ‌రించిన ముగ్గురు మంత్రులు..!

  రేవంత్ తెగింపుకు ఆశ్చ‌ర్య‌పోతున్న అదికార గ‌ణం..! కొడంగ‌ల్ లో మొహ‌రించిన ముగ్గురు మంత్రులు..!

  కొడంగ‌ల్ వ్యవహారాలను ముగ్గురు మంత్రులు పర్యవేక్షిస్తున్నారంటే రేవంత్ ఎఫెక్ట్ టీఆర్ఎస్‌పై ఎంత మేరకు ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఈ మధ్య రేవంత్ ఇళ్లల్లో జరిగిన ఐటీ సోదాలు కూడా కక్షపూరితంగా జరిగినవే అన్న ఆరోపణలూ ఉన్నాయి. వాస్తవానికి రేవంత్ మాట్లాడినట్లు మరే ఇతర పార్టీ నాయకుడు మాట్లాడిన సందర్భాలు తక్కువే. అందుకే ఆయనకు చాలా మంది అభిమానులు ఉన్నారు. వాస్తవానికి రేవంత్ టీడీపీ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చాడు కానీ, మరే నాయకుడు విమర్శించినట్లు ఆ పార్టీని కానీ, అధినేతను కానీ ఒక్క మాట అనలేదు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉన్న ఉన్న‌త శిఖ‌రాలు అందుకోవాల‌ని బాబు ఆశీర్వ‌దించ‌డ‌మే అందుకు కార‌ణం అనే వాద‌న కూడా వినిపిస్తోంది.

  తెలంగాణ‌లో కేసీఆర్ యాక్ష‌న్..! పార్టీల‌కు అతీతంగా రేవంత్ రియాక్ష‌న్..!!

  తెలంగాణ‌లో కేసీఆర్ యాక్ష‌న్..! పార్టీల‌కు అతీతంగా రేవంత్ రియాక్ష‌న్..!!

  అంతేందుకు, మహాకూటమి ఏర్పాటు జరుగుతున్న నేపథ్యంలో చంద్రబాబును బహిరంగంగానే వెనకేసుకొస్తున్నాడు. అలాగే ఆయనపై ఎవరైనా విమర్శలు చేస్తే వాటిని తిప్పికొడుతున్నాడు. ఈ ప్రాసెస్‌లో రేవంత్ అసలు కాంగ్రెస్ నాయకుడు అనే అంశాన్ని కూడా ప‌క్క‌కు పెడుతున్న‌ట్టు తెలుస్తోంది. స్వార్ద‌ప్ర‌యోజ‌నాల కోసం చంద్ర‌బాబు పేరును వాడుకుంటే ఇలాగే ఉంటుంద‌నే సంకేతాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. తాజాగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, కేసీఆర్ నిర్వహిస్తున్న సభల్లో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి నిర్మొహ‌మాటంగా ఖండిస్తున్నారు. కేసీఆర్ చంద్ర‌బాబుపై చేస్తున్న ప‌రుష ప‌ద‌జాలానికి టీడిపి నేత‌ల‌కంటే ముందుగా రేవంత్ రెడ్డే కౌంట‌ర్ ఇవ్వ‌డం విశేషం.

  చంద్ర‌బాబును డిఫెండ్ చేస్తున్న రేవంత్..! మెచ్చుకుంటున్న టీడిపి కార్య‌క‌ర్త‌లు..!!

  చంద్ర‌బాబును డిఫెండ్ చేస్తున్న రేవంత్..! మెచ్చుకుంటున్న టీడిపి కార్య‌క‌ర్త‌లు..!!

  తాజాగా కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న మాట‌ల్లో ఐతే మ‌రీ మ‌జాగా ఉంటాయా. ‘ఓటుకు నోటు దొంగతనం చేసింది నిజం కాదా? అంటూ ఓటుకు నోటు కేసును ప్రస్తావించారు. దీనిపై ‘ఏం పీక్కుంటావో పీక్కో..! ఓటుకు నోటు కేసులో దూరంలో ఉన్న చంద్రబాబును ఏమోగానీ ముందు నన్ను తాకి చూడు' అని కేసీఆర్‌కు రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చాడు. ఇప్పటి వరకు జరుగుతున్న వ్యవహారాలను గమనిస్తున్న టీడీపీ అభిమానులు ‘మా పార్టీ నేతల కంటే రేవంతే బెస్ట్' అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పార్టీ కాక‌పోయినా చంద్ర‌బాబును రేవంత్ రెడ్డి డిఫెండ్ చేస్తున్న విధానాన్ని టీడిపి శ్రేణులు మెచ్చుకుంటున్నాయి.

  మరిన్ని revanth reddy వార్తలుView All

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  In Telangana, political allegations are crossing the limits. Opposition parties are using it as weapon for the criticisms Chief Minister Chandrashekhar Rao who started the bad race in telangana. Apart from Telugu Desam leaders, the tdp segments are welcomed by the Congress party leader Revanth Reddy's counterpart to criticize Chandrashekhar Rao.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more