రవి ప్రకాష్ కు ముందస్తు బెయిల్ మంజూరు..! కొడుకు చదువుకోసం అమెరికా వెళ్తానన్న శివాజీ..!!
హైదరాబాద్: సస్పెన్స్ థ్రిల్లర్ ఉదంతాన్ని తలపించిన రవిప్రకాష్ ఎపిసోడ్ కాస్త సుఖాంతం అయ్యింది. టీవీ 9 మాజీ సీఈఓ రవి ప్రకాష్‌కు కోర్టులో ఊరట లభించింది. ముందస్తు బెయిల్‌ను శుక్రవారం నాడు హైకోర్టు మంజూరు చేసింది. వారానికి ఒకసారి పోలీసుల ముందు హాజరు కావాలని రవిప్రకాష్‌ను హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి ఎక్కడికి వెళ్లకూడదని రవిప్రకాష్‌ను హెచ్చరించింది.
రవిప్రకాష్‌పై అలంద మీడియా ఫిర్యాదు చేసింన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదు మేరకు రవిప్రకాష్‌పై కేసులు నమోదయ్యాయి. తనపై నమోదు చేసిన మూడు ఎఫ్ఐఆర్‌లపై రవిప్రకాష్ ఇప్పటికే హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.తనపై నమోదైన కేసుల విషయమై గత మాసంలో ఆయనను బంజారాహిల్స్ పోలీసులు విచారించారు.
Recommended Video


విచారణకు రాలేనని, పోలీసులకు హీరో శివాజీ ఈ మెయిల్ సందేశం పంపారు. టీవీ-9 మాజీ సీఈవో రవిప్రకాశ్ నుంచి షేర్ల కొనుగోలుకు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించిన కేసులో హీరో శివాజీ మళ్లీ పోలీసు విచారణకు డుమ్మా కొట్టారు. 'మా అబ్బాయిని అమెరికాలోని ఓ స్కూళ్లో చేర్పించాల్సి ఉంది. లుక్‌ఔట్ నోటీసు ఉన్నందు న హైకోర్టు అనుమతి తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నాను.
ఈ పరిస్థితుల్లో నేను విచారణకు రాలేను' అంటూ సైబరాబాద్ సైబర్‌క్రైం పోలీసస్టేషన్‌కు శివాజీ ఈ-మెయిల్ పంపారు. ఈ కేసుకు సంబంధించి ఇటీవల శివాజీని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. మళ్లీ నోటీసు జారీ చేసి 11న విచారణకు రావాలన్నారు. కానీ ఆయన రాకుండా, మెయిల్ పంపారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications