రవితేజ మాజీ డ్రైవర్‌ శ్రీనివాసరావును విచారించిన సిట్: తెలియదనే చెప్పారా?

డ్రగ్స్‌ వ్యవహారంలో సిట్‌ విచారణ కొనసాగుతోంది. శుక్రవారం ప్రముఖ సినీనటుడు రవితేజను విచారించిన సిట్‌ అధికారులు శనివారం ఉదయం నుంచీ ఆయన మాజీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రావును విచారిస్తున్నారు.

హైదరాబాద్‌: డ్రగ్స్‌ వ్యవహారంలో సిట్‌ విచారణ కొనసాగుతోంది. శుక్రవారం ప్రముఖ సినీనటుడు రవితేజను విచారించిన సిట్‌ అధికారులు శనివారం ఉదయం ఆయన మాజీ డ్రైవర్‌ శ్రీనివాస్‌రావును విచారించారు. సుమారు మూడు గంటలపాటు శ్రీనివాసరావును ప్రశ్నించారు.

శనివారం ఉదయం సిట్‌ కార్యాలయానికి చేరుకున్న శ్రీనివాస్‌ను ఐదో అంతస్తులో అధికారులు విచారణ చేపట్టారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడైన కెల్విన్‌తో శ్రీనివాస్‌రావు ఫోన్‌ సంభాషణలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.రవితేజ వద్ద గతంలో శ్రీనివాసరావు కారుడ్రైవర్‌గా పనిచేశారు. కాగా, డ్రగ్స్ కేసులో కీలక నిందితులైన జీషాన్ నుంచి రవితేజకు, ఆయన సోదరుడు భరత్, డ్రైవర్ శ్రీనివాసరావుకు డ్రగ్స్ అందినట్లుగా అనుమానించిన సిట్.. దీనిపైనే ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు సమాచారం.

Ravi Teja's former Driver Srinivasa Rao Appears Before SIT

అయితే, సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు దాదాపు తనకు తెలియదనే సమాధానమే చెప్పినట్లు తెలిసింది. శుక్రవారం సిట్‌ బృందం ముందు హాజరైన రవితేజను దాదాపు 9లకుపైగా అధికారులు విచారించారు.

మాదకద్రవ్యాలు తీసుకునే అలవాటు తనకు లేదని, కెల్విన్‌ సహా మత్తుమందుల సరఫరాదారులెవరూ తనకు తెలియదని రవితేజ చెప్పినట్లు సమాచారం. సిట్‌ అధికారులకు గోర్లు, వెంట్రుకలు, రక్త నమూనాలు ఇచ్చేందుకు రవితేజ నిరాకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+