ఇక్కడ అభిమానులను కలుసున్నందుకు సంతోషంగా ఉంది: రవితేజ
హైదరాబాద్: అలైన్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లరీస్ అందిస్తున్న 'లార్డ్ అండ్ మాస్టర్' బ్రాండ్ హైదరాబాదులో స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ మోనో కార్ట్‌ను ఆవిష్కరించింది. దీనికి నటుడు రవితేజా ప్రచారకర్తగా ఉంటున్నారు. ఆయన దీనిని ఆవిష్కరించారు.
ఈ స్పెషల్ ఎడిషన్ ప్యాక్ లార్డ్ అండ్ మాస్టర్‌తో రవితేజ తన అనుబంధాన్ని.. వేడుక చేసుకునేలా రవితేజ ఇమేజ్‌ను మోనో కార్టన్ ప్యాక్ పైన కలిగి ఉంటుంది. వినియోగదారులు తమ అభిమాన తారను కలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఒక అవకాశాన్ని కలిగించింది.

మీట్ అండ్ గ్రీట్ పోటీ, ఉద్వేగభరిత డబ్ స్మాష్ కాంటెస్ట్ విజేతలతో రవితేజ సంభాషించారు. వినియోగదారులతో పాటు లార్డ్ అండ్ మాస్టర్ నిర్వహించిన డిస్ ప్లే పోటీలో విజేతలైన కొంతమంది వ్యాపారులు కూడా మాస్ మహారాజాను కలుసుకున్నారు.
మోనో కార్టర్‌ను ఆవిష్కరించిన రవితేజ మాట్లాడుతూ... 'లార్డ్ అండ్ మాస్టర్'తో తన అనుబంధం ఎంతో ప్రత్యేకం అన్నారు. ఈ లిమిటెడ్ ఎడిషన్ ప్యాక్ ఆవిష్కరణతో ఈ అనుబంధం మరింత పటిష్టమైందన్నారు. తన అభిమానులను కలుసుకోవడం, వారితో మాట్లాడటం గొప్ప అనుభూతి అన్నారు.

అలైన్ బ్లెండర్స్ అండ్ డిస్టిల్లరీస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బిక్రమ్ బసు మాట్లాడుతూ... రవితేజ సూపర్ స్టార్ అని, ప్రజలచే ప్రేమించబడ్డారని, అభిమానులచే ఆరాధించబడ్డారని, లార్డ్ అండ్ మాస్టర్ లిమిటెడ్ ఎడిషన్ ప్యాక్‌ను రవితేజచే ఆవిష్కరింప చేయడం వేడుక వంటిది అన్నారు.












Click it and Unblock the Notifications