రావులకూ కాంగ్రెస్ ఆహ్వానం: చిన్నారెడ్డి వింత వ్యాఖ్య
తెలుగుదేశం పార్టీ నాయకుడు రావుల చంద్రశేఖర రెడ్డికి తమ పార్టీ నుంచి ఆహ్వానం ఉన్న విషయాన్ని కాంగ్రెసు నాయకుడు జి. చిన్నారెడ్డి బయటపెట్టారు. రావుల నిర్ణయంపై ఆయన వింత వ్యాఖ్య కూడా చేశారు. తెలుగుదేశం పార్ట
వనపర్తి: తెలుగుదేశం పార్టీ నాయకుడు రావుల చంద్రశేఖర రెడ్డికి తమ పార్టీ నుంచి ఆహ్వానం ఉన్న విషయాన్ని కాంగ్రెసు నాయకుడు జి. చిన్నారెడ్డి బయటపెట్టారు. రావుల నిర్ణయంపై ఆయన వింత వ్యాఖ్య కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ చీప్ నారా చంద్రబాబు నాయుడు రాజ్యసభ సీటు ఇవ్వకుంటే రావాలని తాము ఆహ్వానించామని ఆయన చెప్పారు.
అయితే, రావుల చంద్రశేఖర రెడ్డి ఏ విషయాన్ని కూడా త్వరగా బయటపెట్టరని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెసులోకి ఆహ్వానిస్తున్నారా అని అడిగితే బలమైన శక్తులన్నీ ఏకమై ఒకే తాటి మీదికి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన జవాబిచ్చారు.

జెఎసి చైర్మన్ కోదండరామ్ అంతటి వ్యక్తిని వాడు, వీడు అని కెసిఆర్ అనడంపై ఆయన అసహనం వ్యక్తం చేసారు. ఇంత దుర్మార్గమైన పాలన చూస్తుంటే బాధేస్తోందని చిన్నారెడ్డి అన్నారు. తెరాస పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, ఒక ప్రజాప్రతినిధిగా తానే ఇబ్బంది పుతున్నానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications