కెసిఆర్‌కు ఇల్లుంటే చాలునా...: రావుల
సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయం కోసం ఇల్లు కట్టుకుంటే రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు ఉన్నట్లేనా అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్టీఆర్ భవనలో పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు తాజుద్దీన్, అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ10 ఎకరాల స్థలంలో 150 గదులతో వంద కోట్ల ఖర్చుతో ఆరు నెలల్లోనే సీఎం ఇల్లు కట్టుకున్నారని, అదే డబుల్ బెడ్ రూం ఇళ్లు ఎందుకు పూర్తికాలేదని అడిగితే అరెస్టులు చేస్తారా? అని నిలదీశారు.












Click it and Unblock the Notifications