"కేసీఆర్‌కు అంత పెద్ద ఇల్లా? 10 ఎకరాల్లో 150 గదులతో"
హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు టీటీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి. 10ఎకరాల స్థలంలో 150గదులతో సీఎం ఇల్లు నిర్మించుకుంటున్నారని ఆరోపించిన రావుల.. అంత పెద్ద ఇల్లు కేసీఆర్ కు అవసరమా? అని ప్రశ్నించారు.
రాష్ట్రపతి భవన్ తర్వాత సీఎం కేసీఆర్ నిర్మించబోతున్న ఇల్లే అతి పెద్దదని మండిపడ్డారు రావుల. ప్రజలను మభ్య పెట్టడంలో కేసీఆర్ సూపర్ సీఎం అంటూ ఎద్దేవా చేసిన రావుల.. సొంత సర్వేల ద్వారా తానో సూపర్ సీఎం అంటూ కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డబుల్ బెడ్ రూమ్, దళితులకు మూడెకరాల భూమి వంటి ప్రభుత్వ హామిలన్నింటిని అటకెక్కించేశారని ఈ సందర్బంగా రావుల ఆరోపించారు. కల్తీ విత్తనాలతో రైతులు నష్టపోతున్నా.. ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి చర్యలు లేవని అసంతృప్తి వ్యక్తం చేశారాయన.












Click it and Unblock the Notifications