శాడిస్ట్ భాస్కర్.. విచారణలో విస్తుపోయే విషయాలు.. ఎందుకలా తయారయ్యాడు..?

జనగామ జిల్లాలో ఇటీవల వెలుగుచూసిన శాడిస్ట్ భాస్కర్ ఉదంతంలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. విచారణలో భాస్కర్ సంచలన విషయాలు వెల్లడించాడు. మహిళల నంబర్లు ఎలా సేకరించింది.. వారిని ఎలా వేధింపులకు గురిచేసింది వివరించాడు. అయితే తానిలా తయారుకావడానికి ప్రేమలో ఫెయిల్ అవడమే కారణమని తేలింది. ఓవైపు ఆర్థిక సమస్యలు.. మరోవైపు పట్టించుకునేవారు లేకపోవడంతో భాస్కర్ ఇలా తయారయ్యాడని వెల్లడైంది.

ఎవరీ భాస్కర్

ఎవరీ భాస్కర్

జనగామ జిల్లా లింగాల ఘణపురం మండలం నేలపోగులకు చెందిన కందగట్ల భాస్కర్‌ ఎంకాం చదువుకున్నాడు. ఆ సమయంలో ఓ యువతిని ప్రేమించిన భాస్కర్.. ఆమెను వేధింపులకు గురిచేశాడు. దీంతో ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై చార్జిషీట్ కూడా దాఖలైంది. భాస్కర్‌ను దోషిగా తేల్చిన న్యాయస్థానం రెండేళ్ల జైలు శిక్ష విధించింది. జైలు నుంచి బయటకొచ్చాక భాస్కర్ ఎక్కడా ఉద్యోగం పొందలేకపోయాడు.

 అలా ఫోన్ నంబర్స్ సేకరించి..

అలా ఫోన్ నంబర్స్ సేకరించి..

ఎక్కడా ఉద్యోగం రాకపోవడంతో కొన్నాళ్లు ఆరోగ్యశ్రీ విభాగంలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిగా పని చేశాడు. కొన్నాళ్లకు అది కూడా మానేసి సొంత ఊరిలోనే వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో బీసీ కార్పోరేషన్‌కు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులతో సన్నిహితంగా మెలిగిన భాస్కర్.. తెలంగాణ స్టేట్‌ ఆన్‌లైన్‌ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టం నుంచి రుణాలు పొందిన,రుణాలకు దరఖాస్తు చేసుకున్న పలువురు యువతులు,మహిళల ఫోన్ నంబర్స్ సేకరించాడు.

 నగ్నంగా ఫోన్ కాల్స్ చేసేవాడు..

నగ్నంగా ఫోన్ కాల్స్ చేసేవాడు..

ఆ ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి.. రుణాలు పొందే లబ్దిదారులను ఎంపిక చేసేది తానే అని నమ్మించేవాడు. అలా వారికి తరుచూ ఫోన్లు చేయడం.. ఫోటోలు పంపించాలని కోరడం చేసేవాడు. ఆపై అసభ్యకర మెసేజ్‌లు ,అశ్లీల చిత్రాలు,వీడియోలు పంపించేవాడు. ఎప్పుడు పడితే అప్పుడు వాట్సాప్ వీడియో కాల్స్ చేసి నగ్నంగా మాట్లాడేవాడు. అంతేకాదు,వారిని కూడా దుస్తులు విప్పేయాలని వేధించేవాడు. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ యువతి సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించడంతో భాస్కర్ వేధింపులు బహిర్గతం అయ్యాయి.

Recommended Video

    #ViralVideo : Man Argues With Police In Neredmet I నేను కేసీఆర్ మేన‌ల్లుడిని.. న‌న్నే ఆపుతారా..?
    పట్టించుకునేవారు లేక..

    పట్టించుకునేవారు లేక..

    భాస్కర్ తల్లిదండ్రులు ఇద్దరు ఆర్నెళ్ల వ్యవధిలో బ్రెయిన్ స్ట్రోక్‌కి గురయ్యారు. దీంతో వీరి వైద్యానికి రూ.5లక్షల దాకా ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇందుకోసం తనకున్న భూమిని తాకట్టు పెట్టాడు. నెలా నెలా కట్టాల్సిన వాయిదాలు చెల్లించలేకపోయాడు. దీంతో భూమిని జప్తు చేసుకునేందుకు అధికారులు సిద్దమయ్యారు. మరోవైపు భాస్కర్‌ను చూసుకునేవారు ఎవరూ లేరు. తల్లి జబ్బు పడటంతో కుమార్తె వద్ద ఉంటోంది. దీంతో భాస్కర్ తింటే తినేవాడు.. లేదంటే లేదు. ఇలా ఆర్థిక ఇబ్బందులు,ఒంటరితనం.. అన్నీ కలిసి భాస్కర్ శాడిస్టుగా మారాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో అరెస్టయిన భాస్కర్‌‌ను రెండు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించడంతో ఈ విషయాలు బయటపడ్డాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+