రిసెప్షనిస్ట్ పని: లేడీ టెక్కీపై హోటల్లో అత్యాచారయత్నం
హైదరాబాద్: ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాదులోని ఎల్బీనగర్‌లో చోటు చేసుకుంది. ఓ హోటల్లో బస చేసిన సాఫ్ట్‌వేర్ ఇంజనీరుపై అక్కడ విధులు నిర్వహిస్తున్న రిసెప్షనిస్టు అర్థరాత్రి అత్యాచారానికి ప్రయత్నించాడు.
పూణేకు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సోమవారం హైదరాబాద్ వచ్చింది. ఆమె ఎల్బీనగర్‌లోని సితార హోటల్లో బస చేసింది. ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించిన రిసెప్షనిస్టు శేఖర్ గదిలోకి ప్రవేశించి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.

ఆమె కేకలు వేయడంతో అతను అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ ఘటనపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications