"ధాన్యం కొనుగోలులో తెలంగాణ నయా రికార్డు"
తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు చేపట్టినట్లు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ లో 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. రైతుల భాగస్వామ్యంతోనే ఈ రికార్డు సాధ్యమైందని వెల్లడించారు. గతంలో 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును అధిగమించినట్లు మంత్రి ఉత్తమ్ తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియలో చరిత్ర సృష్టించినట్లు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని వివరించారు. అయితే గతంలో కొనుగోలు చేసిన 70.2 లక్షల మెట్రిక్ టన్నుల రికార్డును ఈ ఖరీఫ్ సీజన్ లో అధిగమించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ మేరకు రైతులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పౌరసరఫరాల శాఖ, నీటి పారుదల శాఖతోపాటు రైతుల కృషితోనే ఈ రికార్డు సాధ్యమైందని వివరించారు.

ఇక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కొనుగోలు చేసిన ధాన్యంలో 32.45 లక్షల మెట్రిక్ ధాన్యం దొడ్డు రకం అని పేర్కొన్నారు. అలాగే 38.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సన్న రకానికి చెందినదిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు కనీస మద్దతు ధర (MSP)గా రూ. 16,606 కోట్లు, బోనస్ గా రూ. 1,425 కోట్లు చెల్లింపులు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంతో 14 లక్షల మంది రైతులకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరుతుందని వివరించారు.












Click it and Unblock the Notifications