జియో హ్యాపీ న్యూయర్ ఆఫర్: ఇక 3జీ ఫోన్లలోనూ సేవలు

ఉచితంగా ఇంటర్నెట్ డేటాతోపాటు ఫోన్ కాల్స్ ఇస్తూ టెలికాం రంగంలో సంచలనానికి తెరతీసిన తీసిన జియో మరో అడుగు ముందుకేయనుంది.

న్యూఢిల్లీ: ఉచితంగా ఇంటర్నెట్ డేటాతోపాటు ఫోన్ కాల్స్ ఇస్తూ టెలికాం రంగంలో సంచలనానికి తెరతీసిన తీసిన జియో.. మొబైల్ వినియోగదారులకు మరో ఆఫర్ అందించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఉచిత కాల్స్‌, ఉచిత డేటా సౌకర్యంతో వినియోగదారులకు చేరువైన జియో ఇకపై 3జీ ఫోన్లలోనూ పనిచేయనుంది.

ఇప్పటి వరకు 4జీ ఫోన్లలో మాత్రమే పనిచేస్తున్న జియో సిమ్‌లు 3జీ ఫోన్లలోనూ పనిచేసే విధంగా సంస్థ ఓ యాప్‌ను రూపొందిస్తోంది. డిసెంబర్ చివరలో లేదా వచ్చే నెలలో ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

Reliance Jio SIM will now run on 3G smartphones –Find out how

జనవరి 1న 'హ్యాపీ న్యూఇయర్‌ ఆఫర్‌' కింద 3జీ కస్టమర్లకు ఈ సౌకర్యం కల్పించనున్నట్లు సమాచారం. తొలుత డిసెంబర్‌ 31 వరకు 'వెల్‌కమ్‌ ఆఫర్‌' కింద ఉచిత కాల్స్‌, అపరిమిత డేటా సౌకర్యం కల్పించిన జియో.. ఆ ఆఫర్‌ను మార్చి 31 వరకు ఇటీవల పొడిగించిన విషయం తెలిసిందే.

ఇప్పటికే 5.2కోట్లమంది తమ చందాదారులుగా చేరినట్లు కంపెనీ ఇది వరకే వెల్లడించింది. అయితే మరింత మందికి చేరువయ్యే ఉద్దేశంతో 3జీ కస్టమర్ల కోసం తాజాగా యాప్‌ను సిద్ధంచేస్తోంది. అయితే, రోజుకు 1జీబీ పరిమితిని విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+