GOOD NEWS: రాష్ట్రంలో ఆ 4 రోజులు వర్షాలే వర్షాలు..!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండలు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఓవైపు ఎండలు, మరోవైపు వడగాల్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది.
భూమి ఉపరితలం వేడెక్కిన కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 1 నుంచి 3 వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఏప్రిల్ 4 నుంచి

భూ ఉపరితలం వేడక్కడం కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏప్రిల్ 1 తేదీ నుంచి మూడో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఏప్రిల్ 4వ తేదీన వర్ష ప్రభావం తక్కువగా ఉంటుందని ఐఎండీ తెలిపింది. మరోవైపు భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీల మేర తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
ముఖ్యంగా ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, వికారాబాద్ జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం అధికంగా ఉందని తెలిపింది. ఆయా జిల్లాల్లోని పలుచోట్ల ఈదురు గాలులు కూడా వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications