హైకోర్టులో టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్, కేసీఆర్‌కు మల్లన్నసాగర్‌పై ఊరట

హైదరాబాద్: కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌కు చెందిన భవనాన్ని కూల్చి వేయాలని హైకోర్టు సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. భవనంలో ఉన్న కార్పోరేట్ కాలేజీ వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించింది.

చింతల్‌లో ఎమ్మెల్యేకు చెందిన పలు అక్రమాస్తులున్నాయని, వాటి పైన చర్యలు తీసుకోవాలని పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కొద్ది రోజులుగా హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ రోజు ఉన్నత న్యాయస్థానం కట్టడాల పైన తీర్పు చెప్పింది.

అక్రమ కట్టడాలు ఎక్కడ ఉన్నా వాటి పైన చర్యలు తీసుకోవాల్సిందేనని తెలిపింది. ఈ నేపథ్యంలో చింతల్ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేకు చెందిన భవనాన్ని వెంటనే కూల్చి వేయాలని ఆదేశించింది.

Relief to KCR: High Court dismiss farmers petition on Mallanna Sagar

కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట

మల్లన్న సాగర్ ప్రాజెక్టు పైన కేసీఆర్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. భూసేకరణ పైన 12 మంది రైతులు వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టి వేసింది. జీవో 123 న్యాయసమ్మతం కాదని చెప్పడాన్ని తిరస్కరించింది. ప్రభుత్వం వాదనలతో న్యాయస్థానం సంతృప్తి చెందింది.

బాధిత రైతులకు ఇప్పటికే నష్టపరిహారం ఇచ్చామని, రైతులు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. రైతులు అంగీకరిస్తేనే భూములు కొంటామని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో అవసరమైతే భూ సేకరణ చట్టం అమలు చేస్తామని తెలిపింది. నిబంధనల మేరకే భూసేకరణ జరుగుతుందని, ఇందులో రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+