హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్: ఎన్ని లక్షల మంది ప్రయాణించారంటే?
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు చరిత్ర సృష్టించింది. ఒకే రోజు ఐదు లక్షల పదివేలు మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డును సృష్టించింది. సోమవారం ఒక్కరోజే హైదరాబాద్ మెట్రోలో 5 లక్షల 10వేల మంది ప్రయాణించారు. శనివారం గ్రూప్-4 పరీక్ష కోసం చాలా మంది సొంత ఊర్లకు వెళ్లడం, ఆదివారం సెలవు తర్వాత తిరిగి అందరూ రావడంతోపాటు సోమవారం గురుపౌర్ణమి కావడం కూడా మెట్రో రద్దీకి కారణంగా తెలుస్తోంది.
కాగా, మెట్రో రైలు ప్రారంభించిన మొదటిరోజే 2 లక్షల మంది ప్రయాణించారు. ప్రస్తుతం సగటున సుమారు 4.40 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇక, సోమవారం ఒక్కరోజే ఐదు లక్షలకుపైగా ప్రయాణించారు. మెట్రో రైలును ప్రవేశపెట్టినప్పటి నుంచి నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు కొంత వరకు తగ్గిందనే చెప్పాలి. ప్రయాణికులు తమ గమ్యస్థానాన్ని వేగంగా, సౌకర్యవంతంగా చేరుకునేందుకు మెట్రోను ఆశ్రయిస్తున్నారు.

50 శాతం నుంచి 75 శాతం ప్రయాణ ప్రయాణ సమయాన్ని మెట్రో ఆదా చేస్తుండటం కూడా ప్రయాణికులకు కలిసివస్తోంది. వేసవి కాలంలోనూ ఎండ తీవ్రత తాళలేక ఎక్కువ మంది ప్రయాణికులు మెట్రోనే ఆశ్రయించారు. మరోవైపు, ఇటీవలే విద్యార్థులకు ప్రత్యేక మెట్రో పాస్‌లు కూడా అందుబాటులోకి తీసుకురావడంతో రద్దీ క్రమంగా పెరుగుతోంది. రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. కోచ్‌ల సంఖ్య పెంచకపోవడంతో మెట్రో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. మెట్రో రైళ్లను మరింతగా పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు.
కేవలంమూడే కోచ్లు ఉండడంతో ఉదయం, సాయంత్రం సమయం ఆఫీస్ వేళ్లలోళ్ల రద్దీ విపరీతంగా పెరిగి సిటీ బస్సులను తలపిస్తున్నాయని పలువురు ఫిర్యా దులు కూడా చేశారు. అయినా కూడా మెట్రో ఈ అంశంపై ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వాపోతున్నారు. ప్రయాణికుల రద్దీ పెరుగుతున్నం దున.. కోచ్‌ల సంఖ్యను కూడా పెంచాలని ప్రయాణికులు కోరుతున్నారు. మరోవైపు ఇటీవల మెట్రో స్టేషస్టే న్లలోన్ల ని టాయిలెట్స్కు కూడా ఛార్జీలుర్జీ వసూల్ చేయడం పట్ల ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications