యూపీ ఫలితాలు: 'టీవీ ఛానల్స్‌పై ఒత్తిడి తెలుసు కానీ, అలా చేయొద్దు'
ఎగ్జిట్ పోల్స్ పేరుతో వరుస కథనాలను టీవీ ఛానల్స్ ప్రసారం చేయడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి శుక్రవారం మండిపడ్డారు. యూపీలో బీజేపీ గెలుస్తుందని చెప్పడంపై ఆమె స్పందించారు.
హైదరాబాద్: ఎగ్జిట్ పోల్స్ పేరుతో వరుస కథనాలను టీవీ ఛానల్స్ ప్రసారం చేయడంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకా చౌదరి శుక్రవారం మండిపడ్డారు. యూపీలో బీజేపీ గెలుస్తుందని చెప్పడంపై ఆమె స్పందించారు.
ఎగ్జిట్ పోల్స్ పేరుతో వదంతులు ప్రచారం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నాయని పలు ప్రతిపక్ష పార్టీలు విమర్శలు సంధించాయి. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతుండటాన్ని పలు పార్టీలు తప్పుపడుతున్నాయి. ఫలితంపై శనివారమే స్పష్టత వస్తుందంటున్నారు.
రేణుకా చౌదరి కూడా స్పందించారు. వాస్తవ అంశాలపై దృష్టి సారించడానికి బదులు వదంతులు, అబద్ధాలను గుదిగుచ్చి ప్రసారం చేయడమేమిటని నిలదీశారు. టీవీ ఛానెల్స్‌పై వచ్చే ఒత్తిడి తాను అర్థం చేసుకోగలనని, జాతీయ ప్రయోజనాలు ఇమిడి ఉన్న అంశాలపై ఆ ఛానెల్స్ దృష్టి పెట్టడం లేదని వ్యాఖ్యానించారు.

ఎగ్జిట్ పోల్స్ వరుస ప్రసారాలు, పేనలిస్టులతో ఊదరగొట్టే చర్చలు వంటివి ప్రజాస్వామ్య దేశంలోని ప్రజల తెలివితేటలను కించపరచడం కిందే లెక్క అన్నారు. కాంగ్రెస్ భాగస్వామ్య పక్షమైన ఎస్పీ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేసింది.
పూర్తి మెజారిటీతో అఖిలేష్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ఆ పార్టీ నేత రవిదాస్ మెహ్రోత్రా అన్నారు. అనేక సార్లు ఎగ్జిట్ పోల్స్ తప్పని రుజువయ్యాయని, ఈసారి ఎగ్జిట్ పోల్స్ కూడా అంతేనన్నారు.
అసలు ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయత ఎప్పుడూ ప్రశ్నార్థకమేనని సీపీఐ-ఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అభిప్రాయపడ్డారు. గతంలో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆ తర్వాత తారుమారైన సందర్భాలు చాలానే ఉన్నాయన్నారు. మరో 24 గంటలు ఆగితే ఆ విషయం ఏమిటో తేలిపోతుందన్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications