టీవీ9 రవిప్రకాశ్ విచారణపై నివేదిక... కోర్టు ఆదేశాలతో భవిష్యత్ కార్యచరణ
మూడు రోజుల పాటు టీవీ9 రవి ప్రకాశ్‌ను విచారించిన పోలీసుల విచారణకు సంబంధించిన వివరాలను నేడు కోర్టులో సమర్పించనున్నారు. అనంతరం కోర్టు ఆదేశాలను బట్టి తదుపరి విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే మూడు రోజుల విచారణలో రవిప్రకాశ్ పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు అందివ్వలేదని చెబుతున్నారు. ఆయన లోపల ముబావంగా ఉంటూ మిడియాతో మాత్రం మరోలా మాట్లాడారని పోలీసులు తెలిపారు. ఈనేపథ్యంలోనే అయన అరెస్ట్‌కు రంగం సిద్దం చేస్తున్నట్టు సమాచారం..
దీంతో పోలీసులు ఇవే అంశాలను కోర్టు దృష్టి తీసుకుపోనున్నారు. కేసు దర్యాప్తులో పలు ప్రశ్నలపై సరైన సమాధానం చెప్పకుండా తప్పుదారి పట్టించే విధంగా వ్యవహరించినట్టు పోలీసులు నిర్థారణకు వచ్చినట్టు తెలుస్తోంది. పలు వివరాలు అడిగినప్పుడు తనకు తెలియదని చెప్పకపోవడంతో గుర్తు లేదని చెప్పారని విచారణ అధికారులు తెలిపారు. దీంతో ఇదే అంశాలతో కోర్టుకు నివేదిక పంపించనున్నారు. కోర్టు ఆదేశాలను బట్టి తదుపరి విచారణ కోనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు టీవీ9 లోగోను అమ్ముకోవడంతో పాటు ఫోర్జరీ కేసుకు సంబంధించి పోలీసులు ఆధారాలు కూడ సేకరించినట్టు చెబుతున్నారు. ఈనేపథ్యంలోనే రవిప్రకాశ్ అరెస్ట్‌కు కూడ సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. కాగా జూన్ 4వ తేదీ నుండి 6 తేదీ వరకు రవి ప్రకాశ్‌ను సైబర్‌క్రైమ్ పోలీసులు విచారణ చేపట్టారు.
-
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు -
తెలంగాణ దశను మార్చే బిగ్గెస్ట్ రైల్వే ప్రాజెక్ట్ -
Sunrisers: సన్ రైజర్స్ ను ఆదుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ..! విమర్శల వేళ..! -
పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం రివ్యూ?












Click it and Unblock the Notifications