నయీమ్ కేసులో తొలి ముద్దాయి మాజీ మంత్రి: అరెస్టు అవకాశం?
హైదరాబాద్: గ్యాంగస్టర్ నయీమ్ వ్యవహారంలో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నయీం కేసులో తొలి ముద్దాయిగా ఓ మాజీ మంత్రిని చేర్చే అవకాశాలున్నట్లు టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి. ఆ మాజీ మంత్రిని అరెస్టు చేసే అవకాశాలున్నట్లు తెలుగు టీవీ చానెళ్లలో వార్తలు వస్తున్నాయి..
ఆ మాజీ మంత్రి అండదండలతోనే నయీమ్ ఎదిగినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) గుర్తించినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా సిట్ సేకరించిందని అంటున్నారు. నక్సల్స్‌పై ఉన్న కోపంతో మాజీ మంత్రి నయీమ్‌ను వాడుకున్నట్లు చెబుతున్నారు.

టీవీ చానెళ్ల కథనం ప్రకారం - నల్లగొండ జిల్లాకు చెందిన ఆ మాజీ మంత్రి వద్ద నయీమ్ ఆశ్రయం పొందినట్లు చెబుతున్నారు. నయీం కేసులో అనుమానితులుగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులంతా మాజీ మంత్రి వద్దనే ఆశ్రయం పొందినట్లు చెబుతున్నారు.
నయీమ్ రాజకీయాల్లోకి రావాలని కూడా అనుకున్నట్లు చెబుతున్నారు. నల్లగొండ జిల్లా భువనగిరి ఎమ్మెల్యేలను హత్య చేసి ఆ స్థానంలో మాజీ మంత్రితో పోటీ చేయించాలని అతను అనుకున్నాడని సమాాచారం. ఎమ్మెల్యే హత్యకు రెక్కీ కూడా నిర్వహించాడని అంటున్నారు. ఎమ్మెల్యేలను నయీమ్ బెదిరించాడని కూడా చెబుతున్నారు.
కాగా, నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని నయీమ్ అత్త ఇంట్లో దాదాపు 1400 కోట్ల రూపాయల విలువ చేసే పత్రాలు లభించినట్లు చెబుతున్నారు. అలాగే, నయీమ్ నివాసంలో లభించిన పత్రాల విలువ 630 కోట్లు ఉండవచ్చునని చెబుతున్నారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications