16ఏళ్ల యువతిని పెళ్లాడింది షేక్ కాదు బిచ్చగాడు: డీసీపీ

అరబ్ షేక్ నంటూ 16ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒమన్ తీసుకెళ్లిన వ్యక్తి అక్కడ బిచ్చగాడని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు.

హైదరాబాద్: అరబ్ షేక్ నంటూ 16ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒమన్ తీసుకెళ్లిన వ్యక్తి అక్కడ బిచ్చగాడని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. కాగా, బాలిక తండ్రే 16ఏళ్ల తన కూతుర్ను 21ఏళ్లుగా పెళ్లి అఫిడవిట్‌లో పేర్కొన్నాడని తెలిపారు. ఇప్పటికే అహ్మద్, హాజీ అనే ఇద్దరు బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

బాలిక తండ్రిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తామని చెప్పారు. పాతబస్తీలో గతంలో ఇలాంటి ఘటనలు చాలా ఎక్కువ జరిగేవని, కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో తక్కువ అయ్యాయని అన్నారు. అయితే, పూర్తిగా ఇలాంటి ఘటనలు తగ్గిపోలేదని అన్నారు.

Rescue Hyderabad minor from Omani sheikh: Maneka Gandhi to Sushma Swaraj

పేదరికం, నిరక్షరాస్యులైన తల్లిదండ్రులను లక్ష్యంగా చేసుకుని వారి అమ్మాయిలను ఇక్కడ్నుంచి కొనుగోలు చేసి పెళ్లి పేరుతో అక్కడి తీసుకెళుతున్నారని చెప్పారు. అరబ్ షేక్‌ల మంటూ పాతబస్తీకి చెందిన యువతులను పెళ్లి పేరుతో తీసుకెళ్లి అక్కడ అడుక్కునే వృత్తిలో దింపుతున్నారని, లేదంటే వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారని చెప్పారు.

ప్రస్తుతం ఈ 16ఏళ్ల యువతిని వృద్ధుడికి పెళ్లి చేయడంలో ఒమన్‌కు చెందిన గౌసియా బేగం అనే మహిళ మధ్యవర్తిత్వం చేసిందని చెప్పారు. మరో నాలుగు రోజుల్లో సదరు యువతిని హైదరాబాద్ తీసుకొస్తామని డీసీపీ సత్యనారాయణ తెలిపారు.

ఇది ఇలా ఉండగా, కేంద్రమంత్రి మేనకా గాంధీ హైదరాబాద్ బాలికను ఒమన్ షేక్ బారి నుంచి కాపాడాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కోరారు. అంతేగాక, నగరంలో చట్ట విరుద్ధంగా జరుగుతున్న ఇలాంటి వివాహాలపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కమిషనర్‌ను కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+