పిచ్చిగా: రేవంత్‌రెడ్డి 'సింగం'కు సుమన్ కౌంటర్, హరీష్ రావుకు షాక్

హైదరాబాద్: సింగం వంటి తాను హైదరాబాద్ వచ్చానని తెలిసి ముఖ్యమంత్రి కెసిఆర్ చైనా పారిపోయారన్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు పెద్దపల్లి టిఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ కౌంటర్ ఇచ్చారు.

రేవంత్ రెడ్డి పిట్టి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ రెడ్డి సిగ్గుపడవలసింది పోయి ఇలాంటి పిచ్చిమాటలు మాట్లాడటం విడ్డూరమన్నారు. ఏం చేయాలో అర్థం కాక, ఏదో ఒకటి మాట్లాడాలనే రేవంత్ అలా మాట్లాడుతున్నారన్నారు.

Revanth don't know what to do: Balka Suman counter

హరీష్ రావును అడ్డుకున్న ఆశా వర్కర్లు

తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు కాన్వాయ్‌ను ఆశా వర్కర్లు గురువారం ఉదయం అడ్డుకున్నారు. హరీష్ రావు అదిలాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆయనను చించోలి వద్ద వారు అడ్డుకున్నారు.

మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దులో నిర్మించ తలపెట్టిన పెన్‌గంగా బ్యారేజీ ప్రతిపాదిత స్థలాన్ని ఆయన పరిశీలిస్తారు. జిల్లాలో నిర్వహిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కాగా, పాలిటెక్నిక్ కళాశాలల పైన ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని హరీష్ రావు అన్నారు. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చూస్తామన్నారు. ఉట్నూరులో మోడల్ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేస్తామన్నారు.

ఒరిజినల్ తెలుగు అంటే తెలంగాణ భాషే: పద్మా దేవేందర్ రెడ్డి

ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ భాష, యాస తీరని అన్యాయానికి గురయ్యాయని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. అసలు ఒరిజినల్ తెలుగు అంటేనే తెలంగాణ భాషే అన్నారు. తెలంగాణ భాషకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. తెలంగాణ కవి కాళోజీ నారాయణరావు తెలంగాణ భాషను శ్వాసగా చేసుకుని రచనలు చేశారని కొనియాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+