హైదరాబాద్‌పై రేవంత్ సర్కారు ఫోకస్: నిధుల వరద

హైదరాబాద్ నగరంలో అభివృద్ధి పనులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేటివ్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్(H-CITI) ప్రాజెక్టులో భాగంగా చేపట్టే రహదారుల విస్తరణ కోసం భారీగా నిధులు విడుదల చేసింది. ఏకంగా రూ. 5942 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు ఇస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూడు రోజుల క్రితం ప్రజాపాలన విజయోత్సవాల్లో హెచ్-సిటీలో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రభుత్వం జీహెచ్ఎంసీలోని ఆరు జోన్లలో 5 ప్యాకేజీల్లో చేపట్టనున్న పనులకు నిధులు మంజూరు చేసింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ జోన్‌లోని ఏవోసీ సెంటర్ చుట్టూ ప్రత్యామ్నాయ రహదారుల నిర్మాణం కోసం అత్యధికంగా రూ. 940 కోట్లు విడుదలకు అనుమతులు ఇచ్చింది.

Revanth government s focus on Hyderabad Huge funds released

ఎల్బీనగర్ జోన్‌లో టీకేఆర్ కళాశాల జంక్షన్ నుంచి మందమల్లమ్మ చౌరస్తా వరకు ఆరు వరుసల ఫ్లైఓవర్ కోసం రూ. 416 కోట్లు, ఖైరతాబాద్ జోన్ పరిధిో రైతిబౌలి నుంచి నానల్ నగర్ జంక్షన్ వరకు మల్టీలెవల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి 398 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

శేరిలింగంపల్లి జోన్‌లో ఖాజాగూడ, ఐఐఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల అభివృద్ధికి రూ. 837 కోట్లు, మియాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్డు వరకు ఆరు వరుసల ఫ్లైఓవర్, లింగంపల్లి నుంచి గచ్చిబౌలి వైపు మూడు వరుసలతో అండర్ పాస్ నిర్మాణానికి రూ. 530 కోట్లు విడుదల చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+