తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులన్నీ ఎత్తివేసేందుకు రేవంత్ సర్కారు కీలక నిర్ణయం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూనే.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు సీఎం రేవంత్. కాగా, తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మందిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.

2009 నుంచి 2014 వరకు రాష్ట్రంలోచాలా మందిపై కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు వారిపై ఆ కేసులు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి సర్కారు‌ కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. తెలంగాణ ఉద్యమకారులపై ఉన్న కేసులను ఎత్తివేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.

 Revanth govt to lift cases against telangana movement leaders

ఈ సందర్భంగా 2009 నుంచి జూన్ 2014 వరకు ఉద్యమకారులకు సంబంధించిన కేసుల వివరాలను అందించాలని ఎస్పీలకు డీజీపీ ఆదేశించారు. త్వరలోనే ఉద్యమకారులపై కేసులను ఎత్తివేయాలని నిర్ణయించింది రేవంత్ ప్రభుత్వం. దీంతో కేసులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యమకారులకు భారీ ఉపశమనం లభించనుంది.

ఇది ఇలావుండగా, తెలంగాణ తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అమరుల డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గన్ ​పార్క్‌​లోని అమర వీరుల స్థూపం ముందు భారీ సంఖ్యలో తరలివచ్చిన 1969 తెలంగాణ ఉద్యమకారులు నిరసన చేపట్టారు.

తొలి, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించామని కానీ గత బీఆర్​ఎస్​ ప్రభుత్వం పట్టించుకోలేదని సంఘం అధ్యక్షుడు రామరాజు వాపోయారు. తెలంగాణలో ఏర్పడిన నూతన ప్రభుత్వం తమకు అండగా నిలవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అమరుల కుటుంబానికి 250 గజాల స్థలం, 25 వేల పెన్షన్, 25 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, హెల్త్ కార్డులు, ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వాలని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+