హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బట్టలూడదీస్తాం!: ‘కేటీఆర్ మామ’పై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

Recommended Video

బట్టలూడదీస్తాం! ‘కేటీఆర్ మామ’పై రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు..!

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లే లక్ష్యంగా కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శలు కొనసాగిస్తున్నారు. మంత్రి కేటీఆర్ మామ పాకాల హరినాథరావు ఎస్టీ సర్టిఫికేట్‌తో ప్రభుత్వ ఉద్యోగం పొందారని ఆరోపించారు.

ఇలా చేసి ఓ గిరిజనుడి అవకాశాలను కొల్లగొట్టిన హరినాథరావుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంపై టీఆర్ఎస్ పెంపుడు నేతలు కాకుండా.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ స్పందించాలని అన్నారు.

ఎస్టీ సర్టిఫికేట్ 35ఏళ్లు..

ఎస్టీ సర్టిఫికేట్ 35ఏళ్లు..

ఎస్టీ సర్టిఫికేట్‌తో 35ఏళ్ల ప్రభుత్వ సర్వీసు చేయడంతోపాటు ఇప్పుడు పెన్షన్ కూడా హరినాథరావు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంలో చర్యలు తీసుకొని సీఎం కేసీఆర్ విశ్వాసం కల్పించాలని కోరారు.

కేటీఆర్ మామపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు, ‘కేసీఆర్ హఠావో..' కేటీఆర్ మామపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు, ‘కేసీఆర్ హఠావో..'

మామ మోసం కనిపించట్లేదా?

మామ మోసం కనిపించట్లేదా?

ఈ విషయంలో తాను ఫిర్యాదు చేసినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఎస్టీ పేరుతో కేసీఆర్ వియ్యంకుడు ఉద్యోగాన్ని చేసింది ముమ్మాటికీ నిజమని.. ట్విట్టర్‌లో పలికే కేటీఆర్‌కు తన మామ చేసిన మోసం కనిపించలేదా? అని రేవంత్ నిలదీశారు.

బట్టలూడదీస్తాం

బట్టలూడదీస్తాం

అంతేగాక, తన వియ్యంకుడిని కాపాడాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కోర్టులో ప్రభుత్వం బట్టలూడదీస్తామని హెచ్చరించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టబోదని రేవంత్ స్పష్టం చేశారు.

జైల్తో పెట్టిస్తావా?

జైల్తో పెట్టిస్తావా?

సోనియా గాంధీ పుట్టిన రోజు సందర్భంగా కూడా రేవంత్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. మీడియాకు ధైర్యం ఉంటే చూపించాలంటూ.. పలు కీలక ఆరోపణలు చేశారు. కేటీఆర్ సతీమణి శైలిమ తనకు సీతక్కతో సమానమని చెప్పుకుంటూ.. ఆమె తండ్రి గురించి ఆరోపణలు చేశారు. కేటీఆర్ మామ హరినాథరావు ఎస్టీ సర్టిఫికేట్‌తో ప్రభుత్వ ఉద్యోగం పొందాడని, ఇప్పుడు రిటైరై రూ.40వేల వరకు పెన్షన్ కూడా తీసుకుంటున్నాడని రేవంత్ ఆరోపించారు. అక్రమాలకు పాల్పడిన హరినాథరావును అరెస్ట్ చేసి, జైల్లో పెట్టిస్తావా? అంటూ కేటీఆర్‌ను నిలదీశారు రేవంత్.

English summary
Congress leader Revanth Reddy again targets Telangana minister's uncle.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X