సర్పంచ్‌లా పని చేస్తున్న కేసీఆర్: రేవంత్
హైదరాబాద్: తెలుగుదేశం హైదరాబాదులోనే పుట్టిందని, తెలంగాణకు పరాయి పార్టీ కాదని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం తెలుగు యువత రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్ ఇప్పటి దాకా దానిని అమలు చేయలేదన్నారు. కేసీఆర్ దత్తత తీసుకున్న ఎర్రవెల్లి గ్రామాలను చూపిస్తూ ఆ రెండు గ్రామాలకు సర్పంచ్‌లా పని చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications