కేసీఆర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు..

జూబ్లీహిల్స్​ ఉపఎన్నికలో కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థి నవీన్​ యాదవ్ ఘన విజయం సాధించారు. దాదాపు 25 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్​ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని.. ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ను విమర్శించడం భావ్యం కాదని పేర్కొన్నారు. కేసీఆర్ కుర్చీ గుంజుకోవడానికి కేటీఆర్, హరీష్ రావు ప్రయత్నిస్తున్నారు. వారి సామర్థ్యాలు ఏంటో చూద్దామని జూబ్లీహిల్స్ లో నిరూపించుకోవాలని వదిలేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు నవీన్‌ యాదవ్‌ విజయం కోసం కృషి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్​ పార్టీ శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అధికారం శాశ్వతం కాదని, వారసత్వ సంపద కాదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సూచనలు చేయాలని అన్నారు. సమస్యలపై ధర్నాలు చేసినా తమకు అభ్యంతరం లేదన్నారు. కేటీఆర్, హరీష్ రావు.. ఇద్దరూ అసూయ, అహంకారం తగ్గించుకోవాలని సూచనలు చేశారు. మరోవైపు ఈనెల 17న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించి.. స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కేబినెట్ భేటీలో మంత్రులందరితో ఇదే అంశంపై చర్చిస్తామని వెల్లడించారు.

Revanth Reddy Bombshell KCR Health Very Poor No More Active Politics

ఇక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. 24,729 ఓట్ల మెజార్టీతో విక్టరీ కొట్టారు. ఆయనకు మొత్తం 98,988 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 74, 259 ఓట్లు పోలయ్యాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 17,061 ఓట్లు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+