కేసీఆర్ ఆ పని చేస్తే నామినేషన్ ఉపసంహరించుకుంటా: రేవంత్ రెడ్డి సవాల్!!
తెలంగాణా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది. ముఖ్యంగా తెలంగాణలో ఎన్నికల వార్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా సాగుతుంది. సీఎం కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా ప్రధానంగా కాంగ్రెస్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి కేసీఆర్ కు సవాల్ విసురుతూ ఆయనను టార్గెట్ చేస్తున్నారు.
నిన్నటికి నిన్న దమ్ముంటే కేసీఆర్ కొడంగల్ లో తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరిన రేవంత్ రెడ్డి తాజాగా మరోమారు కేసీఆర్ ను సవాల్ చేశారు. కేసీఆర్ తెలంగాణా రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని ప్రచారం చేస్తున్నారని టార్గెట్ చేసిన ఆయన కరెంట్ విషయంలో కేసీఆర్ కు సవాల్ విసిరారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మూడు గంటల కరెంట్ ఇస్తారని, 24 గంటల కరెంట్ ఇవ్వరని, మళ్ళీ అంధకారంలో ఉండాల్సి వస్తుందని, రైతుల పంటలు ఎండిపోతాయని చెప్తున్నారు. దీనికి కౌంటర్ వేసిన రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ ను సవాల్ చేశారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్నామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారని ఆదిలాబాద్‌లో ఏ సబ్ స్టేషన్‌కైనా వెళ్దామని, దమ్ముంటే రావాలని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
అక్కడి లాగ్ బుక్స్‌లో 24 గంటల కరెంట్ ఇస్తున్నట్లు ఉంటే నేను, కంది శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ ఉపసంహరించుకుంటామని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలని ఆయన మండిపడ్డారు. డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం వస్తుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలు కేసీఆర్ పాలనపై విసిగిపోయారని పేర్కొన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రావటం ఖాయమన్నారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అంటూ ప్రజలు కోరుతున్నారన్నారు.
నిన్నటికి నిన్న కేసీఆర్ ను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి దమ్ముంటే కేసీఆర్ తనపై పోటీ చెయ్యాలన్నారు. కొడంగల్ లో నిజంగా అభివృద్ధి చేస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. కొడంగల్ కు ప్రత్యేక గుర్తింపు తన హయాంలోనే వచ్చిందని పేర్కొన్న ఆయన కేటీఆర్ దత్తత తీసుకొని ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదంటూ ఆరోపించారు. సీఎం కేసీఆర్ ను ప్రజలంతా తరిమికొట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications