కాంగ్రెస్‌లో చేరికపై ఉత్కంఠ: ఆ నేత వల్లే నొచ్చుకున్న రేవంత్, అందుకే ఇలా

తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆయనకు ఎం

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా కొనసాగుతున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆయనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ రేవంత్ పార్టీ వీడటం ఏంటనే ప్రశ్నలు ఈ నేపథ్యంలో ఉత్పన్నమవుతున్నాయి.

మోత్కుపల్లే ప్రధాన కారణమా?

మోత్కుపల్లే ప్రధాన కారణమా?

ఇది ఇలావుంటే.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వైపు చూడటానికి మరో టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులే కారణమని ఆ పార్టీ వర్గాలు చెబుతుండటం గమనార్హం. అంతేగాక, తెలంగాణ టీడీపీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు కూడా రేవంత్ పార్టీ వీడటానికి కారణంగా తెలుస్తోంది.

రేవంత్‌పై విమర్శలు..

రేవంత్‌పై విమర్శలు..

టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలపై పార్టీ పేరుతో రేవంత్ రెడ్డి కొన్ని కార్యక్రమాలను ఏకపక్షంగా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే అందరు నేతలను కలుపుకుని పోవడం లేదనే విమర్శలు కూడా వస్తున్నాయి.

తేల్చేసిన మోత్కుపల్లి..

తేల్చేసిన మోత్కుపల్లి..

ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందని కొందరు నేతలు ప్రచారం చేస్తుండగా.. అలాంటిదేమీ లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు తేల్చి చెప్పేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీతో వెళ్దామనుకున్న రేవంత్ రెడ్డి వర్గం కొంత అసంతృప్తికి లోనైనట్లు తెలిసింది.

జీర్ణించుకోలేని రేవంత్ వర్గం..

జీర్ణించుకోలేని రేవంత్ వర్గం..

తమ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉంటుందని చెబితే.. మోత్కుపల్లి మాత్రం అందుకు విరుద్ధంగా చెప్పడం రేవంత్ వర్గీయులను ఆశ్చర్యానికి గురిచేసింది. అంతేగాక, అవసరమైతే టీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉంటుందని మోత్కుపల్లి చెప్పడంతో.. రేవంత్ వర్గం జీర్ణించుకోలేకపోతోందని తెలిసింది.

రేవంత్ కూడా..

రేవంత్ కూడా..

సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసే రేవంత్ రెడ్డి కూడా మోత్కుపల్లి వ్యాఖ్యలతో కొంత అసహనానికి గురైనట్లు తెలిసింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు అమితమైన ప్రాధాన్యత లభించింది. రేవంత్ వర్గం కూడా ఇందుకు సానుకూలంగా వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.

చేరికపై ఉత్కంఠ?

చేరికపై ఉత్కంఠ?

అయితే, ఢిల్లీలోనే కాంగ్రెస్ పెద్దలను కలిసి ఆ పార్టీ తీర్థం పుచ్చుకుంటారా? లేక కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటకు వచ్చి పాల్గొనే భారీ బహిరంగసభలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+