కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్..
నీళ్ల హక్కుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని.. నీటి హక్కుల కోసమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ.. గత పదేళ్లుగా నీటి విషయంలో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాలను వాడుకుంటే తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలిచి ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రసంగించారు.
" ప్రధానంగా నీళ్ల హక్కుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగింది. నీళ్ల కోసం ఉమ్మడి రాష్ట్రంలో పీజేఆర్ స్వతంత్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. గతంలో నీళ్ల విషయంలో ఎన్నో పొరపాట్లు జరిగాయి. వాటిని సరిదిద్దుకుంటూ వెళ్తున్నాం. ఉమ్మడి ఏపీకి 811 టీఎంసీల నీటి కేటాయింపులు జరిగాయి. అయితే రాష్ట్రం విడిపోయినప్పుడు ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు అని చెప్పారు. కేసీఆర్ పెట్టిన సంతకం ఏపీకి లాభదాయకంగా మారింది. తెలంగాణ 299 టీఎంసీలు చాలు అని అంగీకరిస్తూ పదేళ్ల కాలానికి కేసీఆర్ సంతకం చేశారు. అంటే ఏపీకి 66 శాతం నీళ్లు శాశ్వత హక్కు ఇచ్చేలా కేసీఆర్ సంతకం పెట్టారు" అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
మరోవైపు కృష్ణా, గోదావరి జలాలపై ప్రజాభవన్ లో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు తాము 90 శాతం పూర్తి చేస్తే కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక పూర్తిగా విస్మరించిందన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఉత్తమ్ ఖండించారు. సీఆర్, హరీశ్ రావు అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావడానికి రూ.80 వేల కోట్లు అవసరం అని.. అలాంటిది ఈ ప్రాజెక్టుపై రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినట్లు కేసీఆర్ ప్రభుత్వం చెప్పింది. అయితే రూ.80 వేల కోట్ల ప్రాజెక్టుపై రూ. 27 వేల కోట్లు ఖర్చు చేస్తే 90 శాతం పూర్తయినట్టా అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రూ.27 వేల కోట్లు ఖర్చు చేసి ఎకరాకి కూడా నీళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రూ.7 వేల కోట్లు ఖర్చు చేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications