మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన రేవంత్ రెడ్డి.. గ్లోబరీనాపై బహిరంగ చర్చకు కేటీఆర్‌కు సవాల్
ఇంటర్ బోర్డు తప్పిదాలు రాజకీయంగా పెనుదుమారాన్ని రేపుతున్నాయి. ఈ వ్యవహారపై అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ఈనేపథ్యంలోనే గ్లోబరీనాతో తనకు సంబంధం కేటీఆర్ చెప్పడంతో పాటు ఈ వ్యాఖ్యలు చేసిన వారిపై పరువు నష్టం దావ సైతం వేస్తానని ఆయన ప్రకటించగా , గ్లోబరీనా టెండర్లపై బహిరంగ చర్చకు సిద్దమని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.

కేటీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి
ఇంటర్ వ్యవహరం పై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్దం కొనసాగుతోంది. ముఖ్యంగా ఇంటర్ మార్కుల పోరపాట్లకు కారణమైన గ్లోబరీన చుట్టు రాజకీయ వ్యవహరం తిరుగుతోంది. ఈనేపథ్యలంలోనే గ్లోబరీనా సంస్థ ద్వార టీఆర్ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్ కేటీర్ పై విపక్షలు ఎక్కుపెట్టాయి. కేటీఆర్ ఆదేశాలతోనే గ్లోబరీనాకు కాంట్రాక్టు కట్టబెట్టారని పలువురు ఆరోపణలు చేశారు. ఈనేపథ్యంలో ఇందులో 10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అక్టింగ్ ప్రెసిడెండ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.

గ్లోబరీనాకు నాకు సంబంధం లేదు : కేటీఆర్
ఈ వ్యవహరం పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఘటుగానే స్పందించారు. గ్లోబరీనా సంస్థకు తనకు ఎలాంటీ సంబంధం లేదని మరోసారి స్పష్టం చేశారు. నాలుగు కోట్ల కాంట్రాక్టులో పదివేల కోట్ల కుంభకోణం ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఇలాంటీ వ్యాఖ్యలు కొనసాగితే కోర్టులో పరువు నష్టం దావ వేస్తానని కేటీఆర్ స్వయంగా హెచ్చరించారు. దీంతో ఒక్కసారిగా రాజకీయ వాతవరణ వేడెక్కింది. మరోవైపు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ సైతం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు. కేటీఆర్ పై చేసిన ఆరోపణలకు గాను రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

గ్లోబరీనా కంట్రాక్టుపై బహిరంగ చర్చకు సిద్దం : రేవంత్ రెడ్డి
గ్లోబరీనా సంస్థకు కేటీఆర్ కు సంబంధాలు ఉన్నాయంటూ దీనిపై తాను బహిరంగ చర్చకు సిద్దమంటూ గురువారం రేవంత్ రెడ్డి అన్నారు. గ్లోబరీనాకు ఇంటర్ మార్కుల వాల్యూయెషన్ అప్పగించడంలో కేటీఆర్ ప్రమేయం ఉందని మరోసారి స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో దానిపై బహిరంగ చర్చకు సిద్దమని పేర్కోన్నారు. వారి ఒప్పందంలో అక్రమాలు జరిగినట్టు నిరూపించకపోతే ఏ శిక్షకైనా తాను సిద్దంగా ఉన్నట్టు చెప్పారు. గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవడంతోపాటు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. యువజన కాంగ్రెస్ ఈ అంశంపై చేపట్టిన నిరసన దీక్షకు రేవంత్ రెడ్డి సంఘీభావం తెలిపారు.












Click it and Unblock the Notifications