Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీనియర్లకు అంతు చిక్కని రేవంత్ లెక్కలు - తాజా నిర్ణయం వెనుక..!!

ముఖ్యమంత్రి రేవంత్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఎన్నో అంచనాలతో రేవంత్ కు సీఎం పగ్గాలు అప్పగించింది. తనకు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలని రేవంత్ ప్రయత్నిస్తున్నారు. తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకొనేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. సీనియర్లకు గౌరవం ఇస్తూనే తన మార్క్ ఏంటో నిరూపించుకొనేలా అడుగులు వేస్తున్నారు. దీంతో..రేవంత్ తాజా నిర్ణయం ఇప్పుడు సీనియర్లలో చర్చకు కారణమైంది.

రేవంత్ టీం : రేవంత్ పాలన కోసం తన టీం ఏర్పాటు చేసుకుంటున్నారు. మంత్రుల శాఖల కేటాయింపు పూర్తి చేసారు. వరుసగా పాలనా పరంగా అధికారుల నియమకాలు కొనసాగిస్తున్నారు. తాజాగా ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ సీపీలుగా నియమించారు.మంత్రులకు శాఖలు కేటాయించారు. సీనియర్లకు ప్రాధాన్యత ఉన్న శాఖలనే ఇచ్చారు. ఇదే సమయంలో మరో నాలుగు ప్రధాన శాఖలను మాత్రం తన వద్దే ఉంచుకున్నారు. కేబినెట్ లో ఇంకా ఆరు స్థానాలు భర్తీ చేయాల్సి ఉండటంతో రేవంత్ నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతోంది. అయితే, రేవంత్ సీనియర్లను కాదని తన వద్దే ఈ శాఖలను ఉంచుకోవటం పైన చర్చ మొదలైంది.

Revanth Reddy has retained key portfolio Home, considering it a crucial department

హోం శాఖ సీఎం వద్దే : కీలకమైన హోం శాఖను రేవంత్ తన వద్దే ఉంచుకున్నారు. సీనియర్లు దాదాపుగా కేబినెట్ లో చేరారు. ప్రస్తుతం హోం శాఖ సీఎం వద్దే ఉంది. మంత్రివర్గంలో మరో ఆరు బెర్తులు ఖాళీ ఉన్నాయి. వీటిని వెంటనే భర్తీ చేయాలని రేవంత్ భావించినా..హైకమాండ్ మరి కొంత కాలం ఆగాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు ఉన్న మంత్రులకు కేటాయించని శాఖలను త్వరలో కాబోయే మంత్రులకు ఇచ్చే ఆలోచనలో రేవంత్ ఉన్నారా..లేక వాటిని తానే స్వయంగా పర్యవేక్షించాలని భావిస్తున్నారా అనేది ఇప్పుడు చర్చ. హోం తో పాటుగా, విద్యా, మున్సిపల్, ఎస్సీ సంక్షేమం వంటి శాఖలను ఎవరికీ కేటాయించలేదు. హోం శాఖ ఉత్తమ్, సీతక్క లో ఒకరికి ఇస్తారనే ప్రచారం సాగింది. గతంలో వైఎస్సార్ 2009లో మహిళా మంత్రిగా సబితకు హోం శాఖ కేటాయించారు. 2014 వరకు సబిత అదే పదవిలో కొనసాగారు. ఇప్పుడు రేవంత్ తిరిగి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారని భావించారు.

Revanth Reddy has retained key portfolio Home, considering it a crucial department

రేవంత్ కొత్త వ్యూహం : అదే విధంగా మున్సిపల్ శాఖను ఎవరికీ కేటాయించలేదు. విద్యా శాఖ..ఎస్సీ సంక్షేమ శాఖ విషయంలోనూ రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సీఎంగా ఉంటూ ఈ కీలక శాఖలను పర్యవేక్షించటం సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్ లో ఫలితాలను పరిగణలోకి తీసుకొని మున్సిపల్ - హోం శాఖలను సీఎం తన వద్దే ఉంచుకున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.అదే విధంగా మైనార్టీ సంక్షేమం అప్పగించేందుకు ప్రస్తుత కేబినెట్ లో ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం లేదు. దీని ద్వారా రేవంత్ ఖచ్చితంగా భవిష్యత్ మంత్రివర్గ విస్తరణ పైన పక్కా లెక్కతో ఉన్నారని స్పష్టం అవుతోంది. హైదరాబాద్ పైన పట్టు కొనసాగించేందుకే రేవంత్ హోం తన వద్ద ఉంచుకోవటంతో పాటుగా రాజకీయంగానూ కొత్త అడుగులు వేస్తున్నట్లుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+