రేవంత్‌రెడ్డి "సూపర్‌హిట్" కొట్టారు!!
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం వచ్చింది. తాజాగా మీడియా మేనేజ్‌మెంట్ విషయంలో కూడా ఆయన విజయవంతమయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చే మీడియా లేదని గుర్తించిన రేవంత్ పీసీసీ పదవి అధిరోహించగానే నలుగురైదుగురు మీడియా ప్రముఖులను కలిశారు. ఇతర పార్టీల్లానే తమ పార్టీ వార్తలకు కూడా కవరేజ్ ఇవ్వాలని కోరారు. వారిని కలవడంలో ఆయన ఎటువంటి శషభిషలకు పోలేదు.
తాజాగా రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనకు వచ్చిన సమయంలో కూడా తాను కలిసిన మీడియా ప్రముఖులను రాహుల్‌తో కలిపించారు. రాహుల్‌ను కలవడానికి సదరు మీడియా అధినేతలు హోటల్ వద్దకు రాగానే రేవంత్‌రెడ్డి స్వయంగా వారిని తోడ్కొని వచ్చారు. ఎక్కువ భాగం మీడియా తెలంగాణలో అధికార పార్టీకి మద్దతిస్తోంది. బీజేపీ నేతకు ఒక పేపరు, ఒక ఛానల్ ఉంది. మరో నేత ఒక ఛానల్‌ను టేకోవర్ చేసి నడిపిస్తున్నారు. మరో రెండు ఛానళ్లు బీజేపీ వార్తలకు ప్రాధాన్యత పెంచాయి.

రేవంత్‌రెడ్డి మేనేజ్‌మెంట్ నైపుణ్యంతో మీడియాలో కాంగ్రెస్ వార్తలకు ప్రాధాన్యత పెరిగింది. కవరేజ్ కూడా బాగా ఇస్తున్నాయి. ఎన్ని ఉన్నా ఇతర పార్టీల్లానే కాంగ్రెస్ పార్టీకి కూడా సొంత పత్రిక, సొంత ఛానల్ అనేది ఉండాలని రేవంత్ యోచిస్తున్నారు. గతంలో సాక్షి కాంగ్రెస్‌కు సొంత పత్రికగా ఉన్నప్పటికీ ఆ తర్వాత రాజకీయ పరిణామాల్లో అది తన స్టాండ్ మార్చుకుంది. మీడియా పరంగా కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా రేవంత్‌రెడ్డి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయన చేసిన కృషితో చాలావరకు కాంగ్రెస్ పార్టీ వార్తలు ప్రసారమవుతున్నాయి. తరుచుగా రేవంత్‌రెడ్డి ఇంటర్వ్యూలు, ఇతర ప్రధాన వార్తలకు కూడా బాగా కవరేజ్ ఇస్తున్నాయి. ఒకరకంగా మీడియా మేనేజ్‌మెంట్ విషయంలో రేవంత్‌రెడ్డి సూపర్‌హిట్ కొట్టారని చెప్పవచ్చు.!
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications