ఎర్రబెల్లిని కెసిఆర్ పోమన్నారు, ఇక వాచ్‌మెన్ ఉద్యోగమే: రేవంత్ రెడ్డి
హైదరాబాద్/వరంగల్: తెలంగాణ టిడిపి ప్రధాన కార్యదర్శి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు ఎర్రబెల్లి దయాకర రావు పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి నిన్న నామినేషన్లకు తుది గడువు కావడంతో తెలంగాణ టిడిపి అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు టిఆర్ఎస్ ప్రయత్నించిందన్న వార్తలు వచ్చాయి.
దీంతో తమ పార్టీ అభ్యర్థులను టిడిపి హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించింది. ఈ సందర్భంగా అభ్యర్థులతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రలోభాలకు లోను కామని, పార్టీ మారబోమని వారితో ఆయన ప్రమాణం చేయించారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. పార్టీ మారిన ఎర్రబెల్లికి తెరాసలో దక్కేది వాచ్‌మన్ పోస్ట్ మాత్రమే అన్నారు. అన్నారు. ఎర్రబెల్లి తెరాసలో చేరాక కేసీఆర్ పక్కన నిలబడబోగా, పోయి కూచో పో అని కేసీఆర్ అన్నారట, ఇప్పుడు ఆయనకు మిగిలింది కెసిఆర్ ఫాంహౌజ్‌లో వాచ్‌మన్ ఉద్యోగమే అన్నారు.
వరంగల్‌లో టిడిపి తరపున పోటీ చేయడానికే ఎవరూ లేరని తెరాస నేతలు విమర్శిస్తున్నారని కానీ పెద్దసంఖ్యలో అభ్యర్ధులు ముందుకొచ్చారన్నారు.
వరంగల్ అభివృద్ధికి ఎన్నో చేస్తామని ఏడాది క్రితం సీఎం కేసీఆర్ అక్కడి బస్తీల్లో తిరిగి చెప్పారని, కానీ ఒక్కటి కూడా చేయలేదని ఆరోపించారు. గతంలో ఇచ్చిన హామీలను సిఎం కెసిఆర్ నెరవేర్చలేదన్నారు. వరంగల్ నగర పాలక సంస్థ ఎన్నికల్లో మొత్తం 58 డివిజన్లకు గాను 53 మందికి టిడిపి బీఫారాలు ఇచ్చింది. మిగిలిన స్థానాల్లో స్వతంత్రులకు టిడిపి మద్దతిస్తుంది.
-
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ












Click it and Unblock the Notifications