మావి రాజకీయ లెక్కలు, అందుకే మేమంతా ఉద్యమంలో పాల్గొన్నాం: రేవంత్ షాకింగ్
మా రాజకీయ నాయకులు వారి వారి పార్టీల ఉనికి, మనుగడ, విస్తృత రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, లెక్కలు వేసుకొని పాలుపంచుకున్నారని టిడిపి నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: మా రాజకీయ నాయకులు వారి వారి పార్టీల ఉనికి, మనుగడ, విస్తృత రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, లెక్కలు వేసుకొని పాలుపంచుకున్నారని టిడిపి నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందరూ లెక్కలేసుకున్నారు
ఆయన మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయా పార్టీల జెండాలు మోసిన నాయకులు లెక్కలు వేసుకునే రాజకీయ లబ్ధి కోసం ఉద్యమించారని రేవంత్ వ్యాఖ్యానించారు.

త్యాగాలు చేసింది వారు
ఇక, మా విషయాన్ని (రాజకీయ నాయకులను) పక్కన పెడితే త్యాగాలు చేసిన వారు ఎందరో ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. అమరవీరుల కుటుంబాలు, విద్యార్థులు వంటి వారు ఏమీ ఆశించకుండా ఉద్యమించారని చెప్పారు. వారి త్యాగాలను వృథా కానివ్వవద్దని కేసీఆర్‌కు సూచించారు.

విఫల ప్రయోగం కావొద్దు
ఎవరి త్యాగాల పునాదులపైన రాష్ట్రం వచ్చిందో తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ తెలంగాణ విఫల ప్రయోగంగా ఉండవద్దన్నారు. మన శత్రువులు, మనలను గేలి చేసిన వారి ముందు పలుచన కావొద్దన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ తప్పారన్నారు.

అలా చేయవద్దు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అమరవీరుల స్థూపం నిర్మిస్తామన్నారు. కేసీఆర్ ఆ హామీని ఇచ్చి మరిచారని మండిపడ్డారు. నవ్విన వారి ముందు కేసీఆర్ జారిపడ్డట్లుగా చేయవద్దన్నారు.
-
హైదరాబాద్ మెట్రో విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన! -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications