వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను మాదిగ కులంలో పుట్టలేదు కానీ, కేసీఆర్‌కు థ్యాంక్స్: రేవంత్ రెడ్డి

తాను మాదిగ కులంలో పుట్టి ఉండకపోవచ్చునని, కానీ వారి గళమై మాట్లాడే బాధ్యత తన పైన ఉందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి అన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తాను మాదిగ కులంలో పుట్టి ఉండకపోవచ్చునని, కానీ వారి గళమై మాట్లాడే బాధ్యత తన పైన ఉందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. అనేకసార్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఢిల్లీ వెళ్లినా అఖిల పక్షం ఊసే ఎత్తలేదన్నారు.

అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీష్ రావు తీరును ప్రజలు చూస్తున్నారని మండిపడ్డారు. మాదిగ సోదరుల్లో తనను ఒకడిని చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

 Revanth Reddy

తాను మాదిగ కులంలో పుట్టకపోయినా, వారి కోసం గళమెత్తుతానని చెప్పారు. వర్గీకరణ పైన అఖిల పక్షాన్ని వెంటనే ఢిల్లీకి తీసుకు వెళ్లాలని, ఈ విషయాన్ని మాత్రమే తాము అడుగుతున్నామన్నారు. రెండేళ్ల క్రితం సభలో సీఎం కేసీఆరే స్వయంగా హామీ ఇచ్చారన్నారు.

మాదిగలు ఈ ప్రభుత్వానికి చావు డప్పు కొట్టడం ఖాయమని చెప్పారు. తనను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తే మాదిగ సోదరల గుండెల్లో ఉంటానని చెప్పారు. స్పీకర్ ఎవరి మెప్పు కోసమే పని చేస్తున్నారన్నారు. ఫిరాయింపుల పైన కేసు వేసినందుకు తన పైన కక్ష సాధిస్తున్నారన్నారు.

English summary
Telangana TDP leader Revanth Reddy lashes out at KCR government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X