వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి పోటీ: కేటీఆర్‌కు రేవంత్ కౌంటర్
తెలంగాణ మంత్రి కేటీ రామారావుపై తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కేటీ రామారావుపై తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. చిలుక ఇక్కడిదే.. కానీ పలుకు పరాయిది.. అంటూ తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రేవంత్ కౌంటర్ ఇచ్చారు.
ఆ చిలుక.. అక్కడిదే. పలుకూ.. అక్కడిదే(ఏపీ) అంటూ రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. అసెంబ్లీ లాబీలో చిట్‌చాట్ సందర్భంగా రేవంత్‌తో ఈ విషయాన్ని మీడియా ప్రస్తావించగా పైవిధంగా స్పందించారు.

అంతేగాక, 'ఆయన (కేటీఆర్) గుంటూరు విజ్ఞాన్‌లో చదువుకున్నాడు. 371(డి) ప్రకారం ఆయనకు ఇక్కడ ఏ పోస్టూ రాదు.. ఈ సంగతి ఆయనకూ తెలుసు.. అందుకే వచ్చే ఎన్నికల్లో భీమవరం నుంచి పోటీ చేస్తనన్నడు. ఐతే, గియితే, నాకూ హరీశ్‌కే ఇక్కడ ఛాన్స్ ఉంటుంది' అని రేవంత్ చమత్కరించారు.












Click it and Unblock the Notifications