గోడదూకిన రేవంత్ రెడ్డి.. అరెస్ట్, పోలీసుల తీరుపై మండిపాటు

బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యల నిలయంగా మారింది. విద్యార్థులు ఆందోళనతో విపక్షాల నేతలు సంఘీభావం తెలుపుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ నేతలు బాసర ట్రిపుల్ ఐటీకి వచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలీసుల ఆంక్షలను ఛేదించుకుని ప్రాంగణానికి చేరుకున్నారు. గోడదూకి బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లోకి ప్రవేశించారు. నిరసనలు తెలుపుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

గోడదూకిన రేవంత్..

గోడదూకిన రేవంత్..


రేవంత్ రెడ్డి ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశించిన విషయం గుర్తించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అరెస్ట్ చేసి అక్కడ్నించి తరలించారు. విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. విద్యార్థులను కలిస్తే అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. పోలీసులను ఏమార్చి ట్రిపుల్ ఐటీలోకి ప్రవేశించే క్రమంలో రేవంత్ రెడ్డి కొంతదూరం ట్రాక్టర్‌లో ప్రయాణించారు. ఆపై పొలాల్లో కాలినడకన ఐఐఐటీ వద్దకు చేరుకున్నారు.

కదం తొక్కిన విద్యార్థులు

కదం తొక్కిన విద్యార్థులు


డిమాండ్ల సాధన కోసం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్ధులు రోడ్డెక్కారు. తమ 12 డిమాండ్లను పరిష్కరించాలని విద్యార్థులు అంటున్నారు. దాదాపు 2 వేల మంది కదం తొక్కారు. దీనిపై విపక్షాలు విమర్శలు కూడా చేస్తున్నాయి. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యలకు టీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం. తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడమే వర్సిటీలో సమస్యలు పెరిగిపోవడానికి ప్రధాన కారణం అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇవాళ్టి వరకు రెగ్యులర్ వైస్ ఛాన్స్‌లర్ నియామకం జరగలేదు.

మమ అనిపించి..

మమ అనిపించి..


అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు, వర్సిటీ డీన్ ఇలా అందరూ ఇన్‌చార్జులే పాలకవర్గంలో ఉన్నారు. దీంతో ట్రిపుల్ ఐటీలో పాలన అస్తవ్యస్తంగా మారింది. మూడేళ్ల నుంచి విద్యార్థులకు ప్రభుత్వం అందించాల్సిన ల్యాప్‌టాప్స్, యూనిఫామ్స్, ఇతర వస్తువులు ఇవ్వడం మరిచారు. ప్రభుత్వ హాస్టళ్లలో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. తరచుగా ఆహారంలో పురుగులు వస్తున్నప్పటికీ అధికారులు మెస్ నిర్వాహకులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. మంచి నీటి సరఫరా కూడా సక్రమంగా లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+