కోకాపేట భూముల్లో సీఎం బంధువులకు-సీబీఐ డైరెక్టర్ తో రేవంత్ భేటీ : ప్రధానితోనూ సమావేశం..!!

కొకపేట భూముల్లో జరిగిన అవినీతి పై సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ చీఫ్..ఎంపీ రేవంత్ రెడ్డి కోరారు. సీబీఐ డైరెక్టర్ తో రేవంత్ రెడ్డి సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. కొకపేట భూములను కేసీఆర్ బంధువులకు, కావాల్సిన వారికి తెలంగాణ జాతి సంపదను కట్టబెట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఆధారాలను సీబీఐకి ఇచ్చినట్లుగా రేవంత్ చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్టానికి 1500 కోట్లు నష్టం వచ్చిందన్నారు. దీనికి సంబంధించి లిఖిత పూర్వకంగా సీబీఐ డైరెక్టర కు నివేదిక అందించారు.

తన వారికి దోచి పెడుతున్నారు

తన వారికి దోచి పెడుతున్నారు

కేసీఆర్ తెలంగాణ సంపదను కొల్లగొట్టి రాజకీయాలను కలుషితం చేసి అవినీతి కి పాల్పడి ఎన్నికల ప్రక్రియను దుర్వినియోగం చేస్తున్నారని రేవంత్ ఆరోపించారు. తెలంగాణ సంపదను కొల్లగొట్టి అవినీతి సొమ్ముతో రాజకీయ నాయకులను కొనుగోలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ కి కావాల్సిన గుప్పెడు మంది కొరకు తెలంగాణ సందపను దోచిపెడుతున్నారంటూ మండి పడ్డారు.కొకపేట,కనాపేట భూముల్లో టెండర్లో గోలుమాలు జరిగిందన్నారు.

సీఎస్ తో సహా అధికారుల పైనా ఫిర్యాదు

సీఎస్ తో సహా అధికారుల పైనా ఫిర్యాదు

దీనికి సహకరించిన చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్,జయేష్ రంజన్, అరవింద్ కుమార్,సిద్ధిపేట కలెక్టర్ వెంకటారామిరెడ్డి పై సీబీఐ డైరెక్టర్ కి రాతపూర్వకమైన ఫిర్యాదు చేశానని వివరించారు. మై హోమ్ సంస్థ, రాజ్ పుష్ప సంస్థ,మహబూబ్ నగర్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డి సోదరుడు మన్నే సత్యనారాయణ రెడ్డి ప్రత్యక్ష లబ్ధిదారులు వారి పై కూడా పిర్యాదు చేశానని చెప్పారు. బండి సంజేయ్,కిషన్ రెడ్డి పదే పదే కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతుంది..తెలంగాణ సంపదను దోచుకుంటున్నారు జైల్ కి పంపిస్తామని ప్రకటనలు చేస్తున్నారని..కనీసం కేసీఆర్ పై విచారణకు అదేశించడంలేదని పేర్కొన్నారు.

ప్రధాని-హోం మంత్రిని కలుస్తా

ప్రధాని-హోం మంత్రిని కలుస్తా

వారెవరూ కేసీఆర్ అవినీతిపై విచారణకు అదేశించమని ప్రధాని,హోంమంత్రి..ఈడీ.. సీబీఐ డైరెక్టర్ల కానీ పిర్యాదు చేయడం లేదని తప్పు బట్టారు. తాము కొకపేట భూముల్లో జరిగిన అవినీతి పై ప్రధాని మోడీ,హోంమంత్రి అమిత్ షా ను కలిసి విచారణ జరిపించాలని కోరుతామని స్పష్టం చేసారు. బీజేపీ కి చిత్తశుద్ధి ఉంటే మోడీ,అమిత్ నీతి,నిజాయితీ పరిపాలన అందించాలంటే రాష్టంలో జరిగిన అవినీతి పై విచారణకు అదేశించాలని డిమాండ్ చేసారు.

కిషన్ రెడ్డి- బండి సంజయ్ సీబీఐ విచారణ కోరాలి

కిషన్ రెడ్డి- బండి సంజయ్ సీబీఐ విచారణ కోరాలి

బండి సంజేయ్,కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్న పాదయాత్ర లు చేసిన ప్రజలు మిమ్మల్ని నమ్మరని రేవంత్ మరోసారి చెప్పుకొచ్చారు. కిషన్ రెడ్డి,బండి సంజేయ్ కేసీఆర్ తో కుమ్మక్కు కాకపోతే మేము చేసిన పిర్యాదు పై విచారణకు ఆదేశాలు ఇవ్వాలని అడగండంటూ సూచించారు. కేసీఆర్ అవినీతి పై ప్రధానికి,హోమంత్రికి పిర్యాదు చేయడానికి అపాయింట్మెంట్ దొరకడం లేదా అని నిలదీసారు. కేసీఆర్ తో బీజేపీ నేతలకు అవహగన లేకపోతే తాము ఇచ్చిన ఫిర్యాదు పై విచారణకు అదేశించాలని డిమాండ్ చేసారు. ఐఏఎస్ అధికారులు అవినీతి కి పాల్పడితే సీబీఐ విచారణ చేయొచ్చని రేవంత్ స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+