జైలు నుంచి విడుదల చేయండి: రేవంత్ లేఖ, అసెంబ్లీలో చెప్తా: కెసిఆర్
కొడంగల్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ కొడంగల్ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మంగళవారం నాడు బహిరంగ లేఖ రాశారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సత్ప్రవర్తన కలిగిన జీవిత ఖైదీలను విడుదల చేయాలని కోరారు.
ఎన్నికల సమయంలో ఈ అంశం పైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, ఆ హామీని నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి ఎటువంటి ప్రయత్నం చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఖైదీలను విడుదల చేయాలని కోరారు.

అసెంబ్లీలోనే బదులిస్తా: కెసిఆర్
రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీల పరిస్థితి విచిత్రంగా ఉందని, ప్రజల శ్రేయస్సు కోసం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని సిఎం కేసీఆర్ అన్నట్లుగా తెలుస్తోంది. సెప్టెంబరు మొదటివారంలో ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో శాసనసభలో వీటికి సమాధానమిస్తానని చెప్పారని సమాచారం.
సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, హరీశ్ రావు, లక్ష్మారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు వేర్వేరుగా కలిశారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష పార్టీలు ఉస్మానియా ఆస్పత్రి తరలింపు అంశంపై చేస్తున్న విమర్శలు, ప్రాజెక్టుల నిర్మాణంపై చేస్తున్న ఆరోపణలపై చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలో ఆయన అసెంబ్లీలో బదులిస్తానని చెప్పారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications