హరీష్‌ను హైదరాబాద్‌ నుంచి బహిష్కరించారు: రేవంత్, జీవితారాజశేఖర్‌తో పురంధేశ్వరి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్‌రావుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆయన కొడుకు కెటి రామారావు హైదరాబాద్ నగర బహిష్కరణ విధించారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

గురువారం మెదక్ జిల్లా పటాన్‌చెరులో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హరీష్ రావు వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. తమ పార్టీ నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. అలాగే వారు కారు గుర్తుతో గెలిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు.

Revanth Reddy retaliates Harish Rao

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని ఫతేనగర్ డివిజన్‌లో బీజేపీ మహిళా నాయకురాళ్లు దగ్గుబాటి పురుందేశ్వరి, జీవితా రాజశేఖర్ గురువారం రోడ్ షోలో పాల్గొన్నారు. ఫతేనగర్ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కంచు మహేందర్ గెలుపు కోరుతూ జరిగిన రోడ్ షోలో వారు పాల్గొన్నారు.

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే అది కేంద్ర ప్రభుత్వంతోనే సాధ్యమని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అలాగే ఎన్డీఏ హాయంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+