ఒప్పుకుంటే, నా లొల్లి పోతుందని కర్నాటకలో కలిపేసేవారు: కేసీఆర్‌పై రేవంత్
జిల్లాల విభజన సందర్భంగా తన నియోజకవర్గమైన కొడంగల్‌ను మూడు ముక్కలు చేశారని, కర్నాటక ఒప్పుకొని ఉంటే తన సొంత మండలాన్ని ఆ రాష్ట్రంలో కలిపేసేవారేమోనని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి మంగళవారం నాడు అన్నారు.
హైదరాబాద్: జిల్లాల విభజన సందర్భంగా తన నియోజకవర్గమైన కొడంగల్‌ను మూడు ముక్కలు చేశారని, కర్నాటక ఒప్పుకొని ఉంటే తన సొంత మండలాన్ని ఆ రాష్ట్రంలో కలిపేసేవారేమోనని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి మంగళవారం నాడు అన్నారు.
అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాల విభజన తర్వాత ఎవరు, ఏ జిల్లాలో ఉన్నారో అర్థం కావడం లేదన్నారు.
మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం, మండలం ఏ జిల్లాలో ఉందని రేవంత్ రెడ్డిని ఓ విలేకరి ప్రశ్నించారు. దానికి రేవంత్ ఆసక్తికరంగా స్పందించారు.

నియోజకవర్గం మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వికారాబాద్ జిల్లాల్లో ఉందన్నారు. తనకు సొంత ఇల్లున్న కొడంగల్‌ను కర్నాటకలో కలిపేవారేమోనని, కర్నాటక ఒప్పుకుంటే నా లొల్లి పోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అదే పని చేసేవారని ఎద్దేవా చేశారు.
టిడిపి నుంచి తెరాసలో చేరిన వారి గురించి కూడా రేవంత్ స్పందించారు. మొన్నటిదాకా బహిరంగంగా మాట్లాడిన వాళ్లు ఇప్పుడు బల్లలు, చప్పట్లు కొట్టడంలో తెరాస ఎమ్మెల్యేలతో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడిప్పుడే పశ్చాత్తాప పడుతున్నారని, ఏదో ఓ రోజు ప్లేటు ఫిరాయించినా ఆశ్చర్యం లేదన్నారు.
-
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !!












Click it and Unblock the Notifications