తాగుబోతు ముఖ్యమంత్రి ఉద్ధరిస్తాడా: కెసిఆర్‌పై రేవంత్ రెడ్డి

మహబూబ్‌నగర్: రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలి ఫాంహౌస్‌కే పరిమితమైన తాగుబోతు ముఖ్యమంత్రి ఏం ఉద్దరిస్తారని తెలుగుదేశం పార్టీ కొండగల్ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్‌ జిల్లా కొడంగల్‌ మండలం పర్సాపూర్‌లో మాట్లాడారు.

ఫాంహౌస్‌కే పరిమితమైన కెసిఆర్ పాలన కొన సాగించడంలో విఫలమయ్యారన్నారు. మత్తు వదలకుండా ఫాంహౌస్‌ పక్క గ్రామాల్లోనే పర్య టిస్తూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. క్యాంపు కార్యాలయంలో అందుబాటులో లేకపోవ డంతో సమస్యలపై వస్తున్న వారు ఇబ్బం దులకు గురవుతున్నారని అన్నారు.

Revanth Reddy says boozer KCR can not do anything

తాగుబోతు సీఎంకు మం త్రులు వత్తాసు పలుకుతూ పగటి వేషగాళ్లుగా పర్యటనలు కొనసాగిస్తున్నారని అన్నారు. మంత్రుల్లో సఖ్యత లేకపోవడంతో ఎవరికి వారే ఆధిపత్యం చెలాయిస్తున్నారని విమర్శించారు. నాయకులను పార్టీలో చేర్చుకునేందుకు చూపిస్తున్న శ్రద్ధ అభివృద్ధిపై చూయించలేక పోతున్నారని అన్నారు.

మాయమాటలతో, బెదిరింపులతో ఎంత మందిని పార్టీలో చేర్చుకున్నా కొడంగల్‌ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంటుందని గుర్తు చేశారు. లాభాపేక్షతో చిన్న చిన్న నాయకులు పార్టీని విడిచినంత మాత్రనా నష్టమేమీ లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+