రాజీనామా ఎందుకు చేయాలి?: ఉప ఎన్నిక ప్రచారంపై రేవంత్ రెడ్డి

మహబూబ్ నగర్: రాజీనామా ఊహాగానాల పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్పందించినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేయనని ఆయన చెప్పారు. కొడంగల్లో ఉప ఎన్నిక వస్తుందన్న ప్రచారాన్ని రేవంత్ కొట్టి పారేశారు.

ఏ నేతకూ వర్తించని చట్టం తనకు మాత్రం ఎలా వర్తిస్తుందన్నారు. భారత దేశంలో పలువురు పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు కేసులు ఎదుర్కొంటున్నారని, వారు రాజీనామాలు చేయలేదని చెప్పారు. చెప్పారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆయన గతంలో చెప్పిన విషయం తెలిసిందే.

Revanth Reddy says he will not resign

అబ్దుల్ కలాంను కెసిఆర్ సర్కార్ అహంకారంతో విస్మరించందని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆటంకం కలిగించవద్దని పార్టీలకు అతీతంగా అభివృద్ధి పనులకు సహకరించాలని రేవంత్ రెడ్డి శనివారం నాడు మద్దూర్ మండలంలో అన్నారు.

కొమ్మూర్ నుంచి లింగల్ చెడ్ వరకు జరుగుతున్న బిటి రోడ్డు పనులను ఆయన పరిశీలించారు. రోడ్డు అబివృద్ధి జరిగితే గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి పనుల విషయంలో ఎవరికైనా నష్టం జరిగితే తాను సొంతగా సహకరిస్తానని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+