ప్రధానితో మోదీతో రేవంత్ రెడ్డి భేటీ- ఆహ్వానం, 4 ప్రతిపాదనలు..!!

ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తికావొస్తున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ -2025 నిర్వహణకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ సమ్మిట్ కు తరలిరండి- ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోండి.. అనే నినాదాన్ని ఖరారు చేసింది ప్రభుత్వం. దీనికి ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు, టెక్నాలజీ రంగ నిపుణులు హాజరుకానున్నారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్​ భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనుందీ సమ్మిట్.

దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోజువారీ సమీక్షలు నిర్వహించారు. హైదరాబాద్ చరిత్రలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించిన ఆయన ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఇందుకోసం దేశ విదేశాలకు చెందిన దాదాపు 3,000 మంది ప్రముఖులు రానున్నారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్విడర్, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, వివిధ కంపెనీల అంతర్జాతీయ స్థాయి సీఈఓలు సదస్సుకు హాజరవుతున్నారు.

Revanth Reddy set to visit Delhi to meet PM Modi

తెలంగాణ భవిష్యత్ ప్రణాళికలను ఆవిష్కరించడం, పెట్టుబడులకు గమ్యస్థానంగా రూపొందిన ఇక్కడి వాతావరణం, విధానాలు, స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర అభివృద్ధి సాధన అంశాలను ఈ వేదికగా చాటి చెప్పాలని ప్రభుత్వం సంకల్పించింది. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. పలు టెక్ కంపెనీల సీఈవోలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఈ సదస్సులో పాల్గొనడానికి ఇప్పటికే సంసిద్ధతను తెలియజేశారు.

ఇదే సమ్మిట్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నారు రేవంత్ రెడ్డి. ఇందుకోసం మంగళవారం ఆయన దేశ రాజధానికి బయలుదేరి వెళ్లనున్నారు. రాత్రికి ఢిల్లీకి వెళ్లనున్నారు. బుధవారం నాడు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. గ్లోబల్ సమ్మిట్‌కు ఆయనను ఆహ్వానించనున్నారు. ఆయనతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కూడా రేవంత్ రెడ్డి ఆహ్వానిస్తారని తెలుస్తోంది. అమిత్ షా, నిర్మల సీతారామన్, ప్రహ్లాద్ జోషి, హెచ్ డీ కుమారస్వామి, నితిన్ గడ్కరి.. వంటి కేంద్రమంత్రులను ఆహ్వానిస్తారని చెబుతున్నారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రతిపాదనలను ప్రధాని, కేంద్ర మంత్రులకు అందజేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, ఎక్స్ ప్రెస్ కారిడార్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన వినతిపత్రలను అందజేస్తారని తెలుస్తోంది. బుల్లెట్ ట్రైన్ , మెట్రో రైల్ విస్తరణ వంటివి కూడా ఇందులో ఉన్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+