కాంగ్రెస్ సీనియర్లు కేసీఆర్‌కు అమ్ముడుపోయారు; చేరికలపైనా రేవంత్‌రెడ్డి సంచలనం!!

పాదయాత్ర చేస్తున్న రేవంత్ రెడ్డి బిజెపి, బీఆర్ఎస్ తో పాటు కాంగ్రెస్ నేతలపైనా షాకింగ్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ సీనియర్లు కేసీఆర్ కు అమ్ముడుపోయారన్నారు.

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ నాయకుల పైనే కాదు, సొంత పార్టీ నేతల పైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ఎంత శాతం ఓట్లు పోల్ అవుతాయో కూడా లెక్కలు చెబుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలోనూ, రాజకీయ వర్గాలలోనూ దుమారంగా మారాయి.

కాంగ్రెస్ పార్టీ సీనియర్లపై రేవంత్ సంచలనం

కాంగ్రెస్ పార్టీ సీనియర్లపై రేవంత్ సంచలనం


హాత్ సే హాత్ జోడో యాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్నారు రేవంత్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించిన రేవంత్ రెడ్డి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలోని పెద్దరెడ్లు కేసీఆర్ కు అమ్ముడు పోయారు కాబట్టే కొత్త తరానికి అవకాశం వచ్చిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ను సీరియస్ గా తీసుకోవడం మానేసామని, సీఎంను ఆ పార్టీ నేతలు కూడా సీరియస్ గా తీసుకోవడం మానేశారు అంటూ వ్యాఖ్యలు చేశారు. సీట్ల వారీగా సర్వే చేయడం లేదని పేర్కొన్న ఆయన ప్రజల మూడ్ పై సర్వే జరుగుతుందని పేర్కొన్నారు.

తెలంగాణాలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది: రేవంత్ రెడ్డి

తెలంగాణాలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది: రేవంత్ రెడ్డి

ఇక ఇదే సమయంలో దేశంలో కాంగ్రెస్ పార్టీకి 150 సీట్లు వచ్చే అవకాశం ఉందని, బిజెపి బలంగా ఉందని చెప్పుకోవడం ఒక భ్రమ మాత్రమేనని, బిజెపి బలంగా లేదంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిచే అవకాశాలు లేవని పేర్కొన్న ఆయన, మళ్లీ తను ఎమ్మెల్యేగా కొడంగల్ నుండే పోటీ చేస్తానని తేల్చి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. 32% నుంచి 34% ఓటింగ్ శాతం లో ఉన్నామని, మరో ఐదు శాతం ఓట్ల కోసమే తమ పోరాటం అని తేల్చి చెప్పారు.

 త్వరలో కాంగ్రెస్ లోకి చేరికలు

త్వరలో కాంగ్రెస్ లోకి చేరికలు

క్లీన్ ఇమేజ్ ఉన్నవాళ్లు పార్టీలోకి వస్తే చేర్చుకుంటామని పేర్కొన్న రేవంత్ రెడ్డి 25 సీట్లలో బీఆర్ఎస్ పార్టీకి వస్తుందని, ఇక బిజెపికి ఏడు నుంచి 8 సీట్లు వస్తాయి అంటూ వ్యాఖ్యలు చేశారు. 38% ఓట్లు కాంగ్రెస్ కు వస్తే పక్క అధికారం వస్తుందంటూ రేవంత్ రెడ్డి లెక్కలు చెప్పారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఉంటాయని పేర్కొన్న ఆయన, కాంగ్రెస్ పార్టీలో నాయకులు అభ్యంతరం పెట్టిన పార్టీలో చేరికలను ఆపవద్దని రాహుల్ గాంధీ చెప్పినట్టు వెల్లడించారు. పార్టీలోకి వస్తున్న నాయకులతో మేలు జరిగే అవకాశం ఉంటే ఖచ్చితంగా చేర్చుకుంటామని పేర్కొన్నారు.

ఉత్తర తెలంగాణాపై ఫోకస్ పెట్టామన్న రేవంత్ రెడ్డి

ఉత్తర తెలంగాణాపై ఫోకస్ పెట్టామన్న రేవంత్ రెడ్డి

ఉత్తర తెలంగాణ పై ఫోకస్ పెట్టామన్న ఆయన, వచ్చే ఎన్నికలలో టికెట్లను ముందుగానే ప్రకటిస్తామని వెల్లడించారు. డీఎస్ చేరిక అధిష్టానం పరిధిలో ఉందని పేర్కొన్న ఆయన, చేరికలపై మరింత దృష్టి సారించినట్టు వెల్లడించారు. భట్టి విక్రమార్క యాత్ర ఏఐసీసీ కార్యక్రమమని తాను కూడా హాజరు అవుతానని వెల్లడించారు. కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరైన వ్యాఖ్యలు కాదని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బిజెపి, బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వెస్ట్ బెంగాల్ తరహా రాజకీయం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

బిజెపి, బీఆర్ఎస్ వీధి నాటకం ఆడుతున్నాయి

బిజెపి, బీఆర్ఎస్ వీధి నాటకం ఆడుతున్నాయి

కెసిఆర్ అవినీతిలో బీజేపీ చేస్తున్న ఆరోపణలు ఒక శాతం మాత్రమేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బిజెపి, బీఆర్ఎస్ వీధి నాటకం ఆడుతున్నాయని, ఓట్ల కోసం పాము ముంగీస ఆట ఆడుతున్నారని రేవంత్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. బండి సంజయ్, అరవింద్ తెలంగాణ రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారో చెప్పాలని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, తెలంగాణలో బిజెపికి ప్రయారిటీ లేదన్నారు. కిషన్ రెడ్డికి బాత్రూంలు కడిగే శాఖ ఇచ్చారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+