రాహుల్.. తెలంగాణకు అందుకే వస్తున్నారు, కేసీఆర్‌కు నిజాం గతే: రేవంత్ రెడ్డి హెచ్చరిక

హైదరాబాద్: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. శనివారం గాంధీభవన్‌లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రైతులు పండించిన పంటను.. సీఎం కేసీఆర్ మెడలు వంచి కొనిపిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని అన్నారు. పంట వేయక కొందరు, పంటను తక్కువ ధరకు అమ్ముకొని మరికొందరు రైతులు నష్టపోయారన్నారు.

తెలంగాణలో రూ. 3వేల కోట్ల కుంభకోణం: రేవంత్

తెలంగాణలో రూ. 3వేల కోట్ల కుంభకోణం: రేవంత్

పంట వేయక నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 15 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తక్కువ ధరకు దాన్యాన్ని అమ్ముకున్న రైతులకు రూ. 600 బోనస్ ఇవ్వాలన్నారు. మిల్లర్లు, ప్రభుత్వం కలిసి రూ. 3వేల కోట్ల కుంభకోణం చేశాయని ఆరోపించారు. ఎఫ్‌సీఐకి చెందిన బియ్యం మాయం అయ్యాయని, దీనిపై సీబీఐ విచారణ జరపించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కై రైతులను మోసం చేస్తున్నాయని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ అందుకే తెలంగాణ వస్తున్నారు: రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ అందుకే తెలంగాణ వస్తున్నారు: రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైందని, మే 6న వరంగల్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో రాహుల్ పాల్గొంటారని రేవంత్ రెడ్డి తెలిపారు. మే 7 హైదరాబాద్‌లో పార్టీ నాయకులతో సమావేశం అవుతారని చెప్పారు. కేసీఆర్ అవినీతిని ఎండగట్టడానికే రాహుల్ తెలంగాణకు వస్తున్నారని తెలిపారు. మరో ఏడాదిలో తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి పువ్వాడ అరాచకాలు..: ఇంట్లోకి వచ్చి కొడతారంటూ రేవంత్ వార్నింగ్

మంత్రి పువ్వాడ అరాచకాలు..: ఇంట్లోకి వచ్చి కొడతారంటూ రేవంత్ వార్నింగ్

ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ అరాచకాలు పెరిగిపోయాయని, ఆయన అదుపులో ఉండాలని హెచ్చరించారు. ఇంట్లో దూరి కొట్టే రోజులు వస్తాయన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల మీద కేసులు పెట్టి శునకానందం పొందుతున్నారన్నారు. నిజాం లాగా విపరీతంగా ఆస్తులు కూడబెడుతున్న కేసీఆర్‌కు.. నిజాంకు పట్టిన గతే సీఎం కేసీఆర్‌కు పడుతుందని అన్నారు.

కాగా, రాహుల్ పర్యటన ఖరారు కావడంతో గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పార్టీ ఇంఛార్జీ మాణికం ఠాగూర్ సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ నిత్యం ప్రజల్లో ఉండే విధంగా కార్యాచరణను రూపొందించే అంశంపై చర్చించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+