ఉద్యోగులకు కేసీఆర్ శుభవార్త, మండిపడ్డ రేవంత్! 'మోత్కుపల్లికి గవర్నర్‌గిరి'
హైదరాబాద్: ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఓ శుభవార్త. తెలంగాణ ఉద్యోగుల ప్రమోషన్లకు లైన్ క్లియర్ అయింది. ఉద్యోగాల ప్రమోషన్ల పైన ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
ఉద్యోగుల ప్రమోషన్లపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు మంగళవారం నాడు ప్రకటించింది. గత ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగుల ప్రమోషన్ల రద్దు ఉత్తర్వులను టిఆర్ఎస్ సర్కార్ రద్దు చేసింది. దీంతో తెలంగాణ ఉద్యోగుల ప్రమోషన్లకు లైన్ క్లియర్ అయింది. ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ పైన రేవంత్ ఆగ్రహం
తెలంగాణ ప్రభుత్వం పైన తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మినీ మహానాడులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ప్రజలకు ప్రభుత్వం సేవలు అందడం లేదన్నారు. అమలు కానీ హామీలతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ప్రజల దృష్టి మరల్చేందుకే కొత్త జిల్లాల ప్రతిపాదన అన్నారు. పార్టీ బలోపేతంపై త్వరలో దృష్టి పెడతామన్నారు.

సెంటిమెంట్ వల్లే ఓడిపోయాం: మోత్కుపల్లి
ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన వాళ్లు ఇప్పుడు ప్రభుత్వాన్ని చూసి చెంపలు వేసుకుంటున్నారని టిడిపి నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. సెంటిమెంటు వల్లే గత ఎన్నికల్లో నష్టపోయామని చెప్పారు. ఎన్నికల సమయంలో కొన్ని పొరపాట్లు జరిగాయన్నారు. నిజాంపై పోరాడిన ప్రాంతం తెలంగాణ అని, కేసీఆర్ కుటుంబంపై పోరాడటం తప్పదన్నారు.
మోత్కుపల్లి గవర్నర్ అవుతారు: రమణ
తమ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు గవర్నర్ అవుతారని టిడిపి తెలంగాణ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు. హైదరాబాదులో శాంతిభద్రతలను కాపాడిన ఘనత తమదే అన్నారు. మాలాంటి వాళ్లు నేతలు అయ్యారంటే ఆ ఘనత ఎన్టీఆర్‌దే అన్నారు. రాష్ట్రంలో ఫాంహౌస్ పాలన సాగుతోందన్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు.
-
కేసీఆర్ దళిత వ్యతిరేకి: సీఎం రేవంత్ రెడ్డి -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్












Click it and Unblock the Notifications