రేవంత్ కు కరోనా పాజిటివ్ - పార్టీ నేతలకు సూచన..!!
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. 'ఆజాదీకా గౌరవ్' యాత్రలో భాగంగా నియోజకవర్గాల్లో పార్టీ నేతల పాదయాత్రకు నిర్ణయించారు. రేవంత్ మునుగోడు నియోజకవర్గంలో నిర్వహించ తల పెట్టిన పాదయాత్రలో పాల్గొనాల్సి ఉంది. అయితే శనివారం అనారోగ్యానికి గురయ్యారు. కోవిడ్ లక్షణాలుగా అనుమానించిన రేవంత్ పరీక్ష చేయించుకున్నారు. దీనికి సంబంధించిన రిపోర్టు వచ్చే వరకూ సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. నివేదికలో కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది.

అందరూ పరీక్షలు చేయించుకోండి
గత వారం పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకూ రేవంత్ అటు ఢిల్లీలో...ఇటు మునుగోడు వ్యహారాల్లో హైదరాబాద్ గాంధీ భవన్ లో వరుస సమావేశాలకు హాజరయ్యారు. అయితే, ఆయనకు ఇప్పుడు తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ కావటంతో తనను కలిసిన వారందరూ పరీక్ష చేయించుకోవాలని రేవంత్ సూచించారు. ఈ మేరకు ట్వీట్ చేసారు. తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు రేవంత్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటుగా.. ఫరూక్ అబ్దుల్లా కూడా కరోనా బారిన పడ్డారు.
సోషల్ మీడియా ద్వారా సందేశాలు
కరోనా దేశవ్యాప్తంగా మళ్లీ విజృంభిస్తోంది. దీని బారిన సినీ రాజకీయ ప్రముఖులు, సామాన్యులు పడుతున్నారు. ఢిల్లీ కేంద్రం కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కేసులు పెరుగుతున్న క్రమంలో ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలంగాణతో సహా తొమ్మది రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. ఇదే సమయంలో తెలంగాణలో సీజనల్ వ్యాధులతో ఆస్పత్రుల్లో బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. అయితే, ఇప్పుడు రేవంత్ పార్టీ శ్రేణులకు తన సందేశాలను సోషల్ మీడియా ద్వారా చేరవేస్తున్నారు.
మునుగోడులో రాజకీయ వేడి
తాజాగా కోమటిరెడ్డికి క్షమాపణలు.. అదే విధంగా మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టులు - కోదండరాం వంటి వారిని కలుపుకుపోదాం అంటూ ఆయన వీడియో సందేశం ద్వారా పార్టీ శ్రేణులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. స్వల్ప లక్షణాలతో పాజిటివ్ గా తేలినట్లుగా రేవంత్ వెల్లడించారు. మరో నాలుగైదు రోజుల రేవంత్ ఐసోలేషన్ కే పరిమితం అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 20న టీఆర్ఎస్ బహిరంగ సభ.. 21 ప మునుగోడులో అమిత్ షా బహిరంగ సభ ఉండటంతో.. కాంగ్రెస్ పార్టీ సైతం ఏ విధంగా అక్కడ వ్యవహరిస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications