వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకే ఒక్కడు.!ప్రచారంలో దూకుడు.!ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో అన్నీ తానై దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి.!

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధుల గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి దూసుకెళ్తేన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ తో పాటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఉమ్మడి ఆరు జిల్లాల్లో సభలు సమావేశాలు నిర్వహిస్తూనే ఇద్దరు అభ్యర్థులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అంతే కాకుండా ప్రధాన ప్రత్యర్ధి పార్టీలైన టీఆర్ఎస్, బీజేపి పార్టీల ఆరోపణలకు ప్రత్యారోపణలు చేస్తూనే వ్యూహాత్మకంగా ప్రచారబాద్యతలను నిర్వహిస్తున్నారు ఏఆర్ఆర్.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. జోరుగా సభలు,సమీక్షలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. జోరుగా సభలు,సమీక్షలు నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి..

కాంగ్రెస్ పార్టీలో మొదటినుండీ ట్రంప్ కార్డ్ పాత్ర పోషిస్తున్న వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి,మహబూబ్ నగర్ పట్ట భద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి చిన్నారెడ్డి తో పాటు, వరంగల్, ఖమ్మం, నల్లగొండ అభ్యర్ధి రాములు నాయక్ గెలుపుకోసం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఉన్న కొద్ది సమయంలో ఇద్దరు అభ్యర్ధుల గెలుపు కోసం ఉమ్మడి ఆరు జిల్లాల ప్రజానీకంతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పట్ట భద్రులతో సంప్రదింపులు జరుపుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆవశ్యకతను వివరిస్తన్నారు. అంతే కాకుండా అధికార గులాబీ పార్టీతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపి దేశ,రాష్ట్ర ప్రజలకు ఏంచేసిందనే అంశాలపై రేవంత్ రెడ్డి లోతుగా చర్చిస్తున్నారు.

సావాళ్లు, ప్రతిసవాళ్లు.. ప్రచారంలో వేడి పెంచిన ఏఆర్ఆర్..

సావాళ్లు, ప్రతిసవాళ్లు.. ప్రచారంలో వేడి పెంచిన ఏఆర్ఆర్..

ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాధించుకున్న తెలంగాణలో ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలరనే అంశాన్ని రేవంత్ రెడ్డి ఆధారాలతో సహా అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు. ఆరున్నరేళ్లుగా ఉద్యోగకల్పన అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగాల కల్పనలో తెలంగాణ ప్రజానికాన్ని అధికార పార్టీ నేతలు ఘోరంగా మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికలప్పుడు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయకుండా యువతలో భ్రమలు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఢిల్లీ కేంద్రంగా ధర్నాకు సిద్దం.. మీరు సిద్దమా అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరిన ఏఆర్ఆర్

ఢిల్లీ కేంద్రంగా ధర్నాకు సిద్దం.. మీరు సిద్దమా అంటూ కేటీఆర్ కు సవాల్ విసిరిన ఏఆర్ఆర్

అంతే కాకుండా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్టుమెంట్ రీజియన్ అనుమతులకోసం కాంగ్రెస్ పార్టీ కేంద్రంలోని బీజేపి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్దంగా ఉందని, అందుకు అదికార గులాబీ పార్టీ సిద్దమా అని నిలదీస్తున్నారు రేవంత్ రెడ్డి. సుమారు రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే ఐటీఐఆర్ ప్రాజెక్టు కోసం ఢిల్లీలో ధర్నా చేసేందుకు కూడా తాను సిద్దమని, తెలంగాణ మంత్రి తారక రామారావు సిద్దమా అని ఎఆర్ఆర్ సవాల్ విసురుతున్నారు. అంతే కాకుండా గల్లీలో మాత్రమే బీజేపితో పోరాటం చేస్తున్నట్టు కనిపిస్తున్న గులాబీ పార్టీ ఢిల్లీ లో మాత్రం స్నహపూర్వకంగా వ్యవహరిస్తుంటాయని మండిపడుతున్నారు రేవంత్ రెడ్ది. ఇంవే అంశాలను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కూడా ప్రస్ధావిస్తున్నారు ఎఆర్ఆర్.

అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రేవంత్ వ్యూహాలు.. అన్నీ తానై ప్రచారం నిర్వహిస్తున్న ఏఆర్ఆర్..

అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా రేవంత్ వ్యూహాలు.. అన్నీ తానై ప్రచారం నిర్వహిస్తున్న ఏఆర్ఆర్..

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి మరో ఆరు రోజులు మాత్రమే సమయం ఉన్నందున అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలో వేగాన్ని పెంచాయి. హొటళ్లలో. ఫంక్షన్ హాళ్లతో పాటు ఉదయం వాకింగ్ జోన్ల వద్ద పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ప్రచారం ఒక ఎత్తైతే విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు ప్రతిసావాళ్లు షరా మామూలుగా మారిపోయాయి. ప్రధానంగా ఉద్యోగాల కల్పన, కేంద్ర ప్రభుత్వం నుండి పథకాలకు అనుమతులు, ఎన్నికల వాగ్దానాలు తదితర అంశాలపై పెద్ద ఎత్తున మాటల తూటాలు పేలుతున్నాయి. ఉద్యోగాల అంశంలో బహిరంగ చర్చలకు రావాలంటూ తారాస్దాయిలో రాజకీయ ఆరోపణలు చేసుకున్నాయి పార్టీలు. రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి ఢిల్లీ కేంద్రంగా బీజేపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాచేసేందుకు తాను సిద్దమని, అందుకు కేటీఆర్ సిద్దంగా ఉన్నారా అంటూ సవాల్ విసిరి ఎమ్మెల్సీ ఎన్నికల వేడిని మరింత పెంచారు రేవంత్ రెడ్డి. ఇలా పార్టీలో అన్నీ తానై ముందుకు కదులుతున్నారు ఏఆర్ఆర్.

English summary
Congress MP Revanth Reddy is aiming to win over the graduate MLC candidates. Revant Reddy is working tirelessly to win Congress candidates in Hyderabad, Rangareddy, Mahabubnagar, Warangal, Khammam and Nallagonda.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X